హైదరాబాద్/పేట్‌బషీరాబాద్: నూతన మద్యం దుకాణాల పాలసీ 2021-23కు గాను మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో ఇప్పటి వరకు 363 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 114 షాపులకు ఈ నెల 18 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. జనరల్ కోటాలో 97 షాపులుండగా ఇప్పటి వరకు 297 దరఖాస్తులు వచ్చాయని ఎస్సీ కోటాలో ఐదు షాపులకు గాను 34 దరఖాస్తులు, గౌడ కోటాలో 11కు గాను 31 దరఖాస్తులు రాగా, ఎస్సీ కోటాలో ఒకటి ఉండగా ఒక దరఖాస్తు వచ్చిందని పేర్కొన్నారు. వీటిలో ఎస్‌హెచ్‌వో బాలానగర్ 40 షాపులకు గాను 23 దరఖాస్తులు, ఎస్‌హెచ్‌వో కుత్బుల్లాపూర్ పరిధిలో 44 షాపులకు గాను 294, ఎస్‌హెచ్‌వో మేడ్చల్ పరిధిలో 30 షాపులకు 46 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు.