Advertisement
Advertisement
Abn logo
Advertisement

మద్యం షాపు తొలగించాలని వంటా-వార్పుతో నిరసన

అల్లవరం, డిసెంబరు 3:  గూడాల పంచాయతీ పరిధి తాడికోన రోడ్డులో మద్యం షాపును తొలగించాలని శుక్రవారం తాడికోన గ్రామస్తులు, మహిళలు వంటా-వార్పుతో నిరసన తెలిపారు.  మద్యం షాపును తొలగించాలని, ఎక్సైజ్‌ అధికారుల వైఖరి మారాలంటూ నినాదాలు చేశారు. నిరసనలో తాడికోన సర్పంచ్‌ సాధనాల వెంకటసూర్యనాగమణి, వైసీపీ గ్రామకమిటీ అధ్యక్షుడు శిరంగు వీరబాబు, శిరంగు సత్యనారాయణ, సాధనాల నాగబాబు, సాధనాల వెంకటరామారావు, ఎస్‌.పెద్దింట్లు, కత్తుల బాబూరావు, ఉండ్రు సత్యనారా యణ, సుంకర నాగేశ్వరరావు, నందిక సత్యనారాయణ  పాల్గొన్నారు.

Advertisement
Advertisement