మద్యం దుకాణంలో చోరీకి యత్నం

ABN , First Publish Date - 2021-07-25T06:01:39+05:30 IST

మద్యం దుకాణంలో చోరీకి యత్నం

మద్యం దుకాణంలో  చోరీకి యత్నం
మద్యం దుకాణం వద్ద విచారిస్తున్న డీఎస్పీ శ్రీనివాసులు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, జూలై 24 : అంపాపురం వద్ద గల ప్రభుత్వ మద్యం దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి చోరీకి యత్నించాడు. దుకా ణానికి వేసి ఉన్న తాళాన్ని బద్దలు కొట్టే యత్నంలో అడ్డుకున్న వాచ్‌మెన్‌ సత్యనారాయణ తలపై కొట్టి అతని దగ్గరున్న రూ. 1200, ఏటీఎమ్‌ కార్డు, సెల్‌ఫోన్‌ తీసుకుని పరారయ్యాడని పోలీసులకు షాపు సూపర్‌వైజర్‌ సతీష్‌ ఫిర్యాదు చేశాడు.విషయం తెలుసుకున్న నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు, సీఐ సతీష్‌లు ఘటనా స్ధలానికి చేరుకుని దుకాణాన్ని పరిశీలించి షాపు సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలిసుకున్నారు. నూజివీడు సీసీఎస్‌ క్లూస్‌ టీం సీఐ బాలశౌరి, ఎస్సై అజయ్‌ కుమార్‌ ఆధారాలు సేకరించారు. వైన్‌ షాపు వద్ద గల సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించడం కొంత సమయం పట్టవచ్చని వారు తెలిపారు. వాచ్‌మెన్‌ తలపై తీవ్రగాయమవడంతో గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  వీరవల్లి ఏఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేశారు.  

Updated Date - 2021-07-25T06:01:39+05:30 IST