Abn logo
May 17 2021 @ 00:21AM

తాంసిలో ఈదురు గాలులు

తాంసి, మే16: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. 20 రోజుల నుంచి వరుసగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండడంతో అన్న దాతల పరిస్థితి అగమ్యఘోచరంగా మారింది. చేతికి వచ్చిన పంట నేల పాలు అవుతుండడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో జొన్న వేరుశనగ, నువ్వులు, మిను ముల పం టలకు భారీ నష్టం వాటిల్లింది. ఆరబోసిన జొన్నలు అన్ని తడిసి ముద్దయ్యాయి.

జొన్నలను వెంటనే కొనుగోలు చేయాలి..

జొన్నలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని అఖిల పక్షం రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. జొన్నలు చేతికి వచ్చి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పక్షం రోజుల నుంచి వడగండ్లు రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయని దాన్ని కూడా పూర్తి స్థాయిలో సర్వే చేసి రైతాంగానికి నష్ట పరిహారం అందిం చాలన్నారు. ఇందులో నాయకులు నవీన్‌రెడ్డి, ప్రమోద్‌, రామన్న, కిరణ్‌కుమార్‌, ఆశన్న తదితరులున్నారు.

Advertisement