ఆ మెసేజ్‌ ఎందుకు వస్తోంది?

ABN , First Publish Date - 2020-08-22T19:46:28+05:30 IST

నేను విండోస్‌ 7 వాడుతున్నాను. రోజూ సిస్టమ్‌ ఆన్‌ చేసినప్పుడు

ఆ మెసేజ్‌ ఎందుకు వస్తోంది?

నేను విండోస్‌ 7 వాడుతున్నాను. రోజూ సిస్టమ్‌ ఆన్‌ చేసినప్పుడు  ‘విండోస్‌ ఈజ్‌ నాట్‌ జెన్యూన్‌’ అనే మెసేజ్‌ వస్తోంది. స్ర్కీన్‌ బ్లాక్‌ అవుతోంది. దీనికి పరిష్కారం ఏంటి? 


మీరు విండోస్‌ 7 పైరేటెడ్‌ వెర్షన్‌ వాడుతున్నారు. ఇలా పైరేటెడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం వాడటం వల్ల సెక్యూరిటీ పరమైన ప్రమాదాలు ఉంటాయి. మీ కంప్యూటర్‌ని చాలా సులభంగా హ్యాక్‌ చేసే అవకాశం ఉంది. చాలామంది వినియోగదారులకు విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం జెన్యూన్‌ కొనాలి అన్న అవగాహన కూడా ఉండదు. హార్డ్‌వేర్‌ టెక్నీషియన్‌ పైరేటెడ్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే దాన్ని వాడేస్తూ ఉంటారు. మీరు పైరేటెడ్‌ వాడుతున్నారు కాబట్టే ఈ మెసేజ్‌ వస్తుంది. కొంతమంది ప్యాచ్‌లు, లోడర్లు వాడుతూ, స్ర్కీన్‌ బ్లాక్‌ అవకుండా సెట్‌ చేసుకుంటారు గానీ అది పూర్తిగా ప్రమాదకరం. ఈ ప్యాచ్‌లు, లోడర్లు స్పైవేర్లని, వైర్‌సలను కలిగి ఉంటాయి. మీ కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టా్‌పలో ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి లోడర్లని వాడడం వల్ల మీకు తెలియకుండానే మీ నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌నేమ్‌ పాస్‌వర్డ్‌లు, గూగుల్‌, ఫేస్‌బుక్‌ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లు తస్కరించే ప్రమాదముంటుంది. కాబట్టి దీనికి ఒకటే సరైన పరిష్కారం.. మీరు ఎంపిక చేసుకునే వెర్షన్‌ బట్టి ఐదు నుండి పది వేల రూపాయల వరకూ ఖర్చుపెట్టి విండోస్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ కొనుగోలు చేయడం!

- కిరణ్‌

Updated Date - 2020-08-22T19:46:28+05:30 IST