స్పిన్నర్ల తడాఖా

ABN , First Publish Date - 2022-08-08T10:21:08+05:30 IST

ఐదు టీ20ల సిరీ్‌సను భారత జట్టు 4-1తో ముగించింది. ఆదివారం జరిగిన చివరి టీ20లో భారత స్పిన్నర్లు బిష్ణోయ్‌ (4/16), కుల్దీప్‌ (3/12), అక్షర్‌ (3/15)ల ధాటికి విండీస్‌..

స్పిన్నర్ల తడాఖా

ఐదో టీ20లోనూ విండీస్‌ చిత్తు

లాడర్‌హిల్‌: ఐదు టీ20ల సిరీ్‌సను భారత జట్టు 4-1తో ముగించింది. ఆదివారం జరిగిన చివరి టీ20లో భారత స్పిన్నర్లు బిష్ణోయ్‌ (4/16), కుల్దీప్‌ (3/12), అక్షర్‌ (3/15)ల ధాటికి విండీస్‌ బేజారెత్తిం ది. దీంతో భారత్‌ 88 పరుగుల భారీ తేడా తో నెగ్గింది. ఓపెనర్‌గా అవతారమెత్తిన శ్రేయాస్‌ (64) ఫామ్‌ నిరూపించుకున్నా డు. దీపక్‌ హుడా (38), హార్దిక్‌ (28)  రాణించడంతో భారత్‌ 20 ఓవర్లలో 7 వికె ట్లకు 188 పరుగులు సాధించింది.  స్మిత్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం విం డీస్‌ 15.4 ఓవర్లలో కేవలం 100 పరుగులకే కుప్పకూలింది. హెట్‌మయెర్‌ (56) ఒక్కడే పోరాడాడు.  


శ్రేయస్‌ సూపర్‌:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన భారత్‌కు ఈసారి ఇషాన్‌ (11), శ్రేయాస్‌ ఓపెనర్లుగా వచ్చారు. ఇషాన్‌ ఐదో ఓవర్‌లోనే వెనుదిరిగినా శ్రేయాస్‌ మాత్రం ధాటిగా ఆడాడు. దీంతో  పవర్‌పే ్లలోనే జట్టు స్కోరు 53కి చేరింది. అతడికి హుడా సహకారం అందించాడు. ఆరో ఓవర్‌లో హుడా రెండు ఫోర్లు బాదగా.. ఎనిమిదో ఓవర్‌లో శ్రేయాస్‌ రెండు సిక్సర్లతో చెలరేగి 30 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అటు 11వ ఓవర్‌లో హుడా 4,6.. శ్రేయాస్‌ 4తో 17 రన్స్‌ వచ్చాయి. కానీ దూకుడు మీద కనిపించిన ఈ జోడీని వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చిన విండీస్‌ పైచేయి సాధించింది. రెండో వికెట్‌కు వీరు 76 పరుగులు జోడించారు. ఆ తర్వాత శాంసన్‌ (15), దినేశ్‌ కార్తీక్‌ (12) త్వరగానే అవుట్‌ కావడంతో పరుగులు కూడా నెమ్మదించాయి. ఆఖరి ఐదు ఓవర్లలో భారత్‌కు 47 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే 19వ ఓవర్‌లో హార్దిక్‌ చెలరేగి 6,4,6తో 19 రన్స్‌ రాబట్టి భారీ స్కోరుకు కారణమయ్యాడు. చివరి ఓవర్‌లో హార్దిక్‌, అక్షర్‌ (9) వికెట్లను తీసిన స్మిత్‌ ఏడు పరుగులే ఇచ్చాడు.

Updated Date - 2022-08-08T10:21:08+05:30 IST