గాలి దుమారం బీభత్సం

ABN , First Publish Date - 2022-05-25T06:56:18+05:30 IST

ఎటపాక మండలంలో సోమవారం రాత్రి గాలి దుమారం బీభత్సం సృష్టించింది. నందిగామ, కృష్ణవరం గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి.

గాలి దుమారం బీభత్సం

 ఎటపాక, మే24: ఎటపాక మండలంలో సోమవారం రాత్రి గాలి దుమారం బీభత్సం సృష్టించింది. నందిగామ, కృష్ణవరం గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. నందిగామలో గాలి దుమారం ధాటికి సిద్దె రాములుకు చెందిన  రేకుల ఇంటి పైకప్పు ధ్వంసమైంది. ఇదే గ్రామంలో జి.నర్సింహారావుకు చెందిన ఇంటి పైరేకులు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే కృష్ణవరం గ్రామంలోని సోయం సునీత, భర్త శ్రీను, ముగ్గురు కుమార్తెలు ఇంట్లో ఉండగానే తాటాకిల్లు కూలింది. సునీత, ఆమె కుమార్తె అమృతకు గాయాలయ్యాయి. నందిగామ గ్రామంలో ఒకే చోట ఆరు విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. చలెంపాలెం, సీతాపురం, గన్నవరం, నెల్లిపాక, మురుమూరు తదితర గ్రామాల్లో రహ దారిపై  చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Updated Date - 2022-05-25T06:56:18+05:30 IST