ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించండి

ABN , First Publish Date - 2022-06-29T05:38:46+05:30 IST

రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించండి
మీడియాతో మాట్లాడుతున్న కాలవ శ్రీనివాసులు


 టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు 

అనంతపురం అర్బన, జూన 28: రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డిని గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక జిల్లా టీడీపీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారధి, మాజీ ఎమ్మెల్యేలు వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి తదితర ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం కోసం టీడీపీ శ్రేణులతో కలిసి చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించారు. అనంతరం టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ మూడేళ్ల వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారన్నారు. అన్ని వర్గాల అభివృద్దిని విస్మరించారన్నారు. చదువుకున్న వ్యక్తులు వైసీపీ అరాచకాలను ముందుగా గుర్తించారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా రాంగోపాల్‌రెడ్డిని పార్టీ అధిష్టానం నిర్ణయించిందన్నారు. 25 సంవత్సరాలుగా కడప జిల్లా పులివెందులలో ఎలాంటి పదవులులేకుండా నిస్వార్థంగా ఆయన పనిచేస్తూ వస్తున్నారన్నారు. రాజకీయ అనుభవం, బాధ్యతగా నడుచుకునే టీడీపీ అభ్యర్థిని గెలిపించి, వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసారఽథి మాట్లాడుతూ జగన పాలనకు చరమగీతం పాడేందుకు అన్ని వర్గాలు సిద్దంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఆలం నరసానాయుడు, తలారి ఆదినారాయణ, వెంకటశివుడు యాదవ్‌, దేవళ్ల మురళి, శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడి ్డ, టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. 


టీడీపీ డాక్టర్స్‌ సెల్‌ కమిటీ ఏర్పాటు

టీడీపీ జిల్లా డాక్టర్స్‌ సెల్‌ నూతన కమిటీ నియామకమైంది. నూతన కమిటీలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షురాలిగా గుంతకల్లుకు చెందిన డాక్టర్‌ హిమబిందు, ప్రధాన కార్యదర్శిగా అనంతపురం అర్బనకు చెందిన ఎం.లక్ష్మీప్రసాద్‌ను నియమించారు. వీరికి పలువురు టీడీపీ నాయకులు, డాక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-06-29T05:38:46+05:30 IST