రూ.73 కోట్లకు అమ్ముడుపోయిన షేక్‌స్పియర్ పుస్తకం

ABN , First Publish Date - 2020-10-15T19:26:01+05:30 IST

ఇంతకు ముందు కొన్ని పుస్తకాలు అత్యధిక ధరకు వేలంలో అమ్ముడు పోయాయి. బిల్ గేట్స్ రాసిన ‘కోడెక్స్ లియోసెస్టర్ ఆఫ్ లియానార్డో డే విన్సి’ పుస్తకం 1994లో వేసిన వేలంలో

రూ.73 కోట్లకు అమ్ముడుపోయిన షేక్‌స్పియర్ పుస్తకం

న్యూయార్క్: ప్రముఖ రచయిత, నాటకకర్త షేక్‌స్పియర్ రాసిన మొదటి నాటక సంకలనం ‘‘ఫస్ట్ ఫోలియో’’ కాపీని వేలంలో ప్రదర్శించగా 73 కోట్ల రూపాయల (9.97 మిలియన్ డాలర్లు) రికార్డు ధరకు అమ్ముడుపోయింది. న్యూయార్క్‌లోని క్రిస్టీ వేలంలో బుధవారం దీనిని ప్రదర్శించారు. వాస్తవానికి ఈ పుస్తకానికి 4 నుంచి 6 మిలియన్ డాలర్లు వస్తాయని వేలందారులు ఊహించారు. వారు ఊహించన దాని కంటే రెండు రెట్లు ఎక్కువ మొత్తానికి ఫస్ట్ ఫోలియో అమ్ముడు పోయింది.


36 నాటకాలతో మలిచిన ఈ పుస్తకాన్ని 1623లో తొలి ముద్రించారట. ఇంగ్లీష్ మాస్టర్ పబ్లికేషన్ ద్వారా మార్కెట్లోకి విడుదలైన ఈ పుస్తకాన్ని ఇంగ్లీషు భాషలో గొప్ప సాహిత్యంగా అభివర్ణిస్తుంటారు. ఈ పుస్తక ముద్రణకు జాన్ హెమింగే, హెన్రీ కోండెల్ అనే ఇద్దరు స్నేహితులు సహకరించినట్లు షేక్‌స్పియర్ తన పుస్తకంలో చెప్పుకొచ్చారు.


ఇంతకు ముందు కొన్ని పుస్తకాలు అత్యధిక ధరకు వేలంలో అమ్ముడు పోయాయి. బిల్ గేట్స్ రాసిన ‘కోడెక్స్ లియోసెస్టర్ ఆఫ్ లియానార్డో డే విన్సి’ పుస్తకం 1994లో వేసిన వేలంలో 30.8 మిలియన్ డాలర్లకు (220 కోట్ల రూపాయలు)  అమ్ముడుపోయింది.

Updated Date - 2020-10-15T19:26:01+05:30 IST