కరోనా సీజన్లో మెడిటేషన్‌ కాంపిటీషన్స్‌... పాల్గొంటారా?

ABN , First Publish Date - 2020-04-09T23:43:50+05:30 IST

ఏరా బాబ్జీ ఇది విన్నావా? ఈ కరోనా వైరస్‌ వల్ల... కొన్ని గేములకి గొప్ప డిమాండ్‌ వచ్చేసిందట.

కరోనా సీజన్లో మెడిటేషన్‌ కాంపిటీషన్స్‌... పాల్గొంటారా?

టెక్‌ టాక్‌ : మెడిటేషన్లో కాంపిటీషన్‌

( రాంజీ, బాబ్జీ టెక్‌ డిస్కషన్‌ )


రాంజీ : ఏరా బాబ్జీ ఇది విన్నావా? ఈ కరోనా వైరస్‌ వల్ల... కొన్ని గేములకి గొప్ప డిమాండ్‌ వచ్చేసిందట.

బాబ్జీ : ఇదేంట్రా బాబూ? వైరస్‌ వల్ల ఒలింపిక్స్‌ లాంటివాటికే సమస్య వచ్చి పడితే... డిమాండ్‌ పెరగడం అంటావేంటి?


రాంజీ : అంటే ఇవి స్పోర్ట్స్‌ లాగ బయట ఆడే ఆటలు కాదురా!

బాబ్జీ : ఓహో మొబైల్‌ గేమ్సంటావా? అవును మరి. లాక్‌ వేసుకుని తీరిగ్గా ఇంట్లో కూర్చునేసరికి... ప్రతివాడూ మొబైల్‌ ఫోనే పట్టుకు కూర్చుంటున్నాడు. దాంతో గేమ్స్‌కి ఆటోమేటిగ్గా డిమాండ్‌ పెరుగుతుంది మరి.


రాంజీ : అబ్బే. అలాంటి అల్లాటప్పా గేమ్స్‌ కాదురా! ఇవి మెడిటేషన్‌ గేమ్స్‌..

బాబ్జీ : అదేంట్రా? మెడిటేషన్‌ అంటే ధ్యానం కదా? ధ్యానంలో గేమ్స్‌ ఏంటి? ఇదేమన్నా పరుగుపందెమా?


రాంజీ : నీకు తెలియదా? ఈ మధ్య మెడిటేషన్‌ డివైజ్‌లు కొన్ని వచ్చాయ్‌. మ్యూజ్‌ అనీ... ఎమోట్‌ అనీ... న్యూరోస్కీ అనీ...

బాబ్జీ : ఏమోస్కీ...?


రాంజీ : న్యూరోస్కీ... ఇవన్నీ రకరకాల డివైజ్‌లు లే. చేతికి తగిలించుకునే ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌ ఉన్నాయి కదా? అలాగే వీటిని తలకి తగిలించుకోవాలి.

బాబ్జీ : తగిలించుకుని?


రాంజీ : తలకి తగిలించుకుని మెడిటేషన్‌ చేయాలి.

బాబ్జీ : అదేంట్రా? మెడిటేషన్‌ చేసేటప్పుడు.. ఆ చేసేదేదో ప్రశాంతంగా చేసుకోక... తలకి ఈ తద్దినం ఎందుకు?


రాంజీ : ఎందుకేంటి? మనం మెడిటేషన్‌ కరెక్ట్‌గా చేస్తున్నామో లేదో చెబుతాయివి...

బాబ్జీ : అబ్బో.


రాంజీ : ఇంతకీ ఈ గేమ్‌ ఎలా ఆడాలంటే... ఆ డివైజ్‌ని తలకి తగిలించుకుని... వీలైనంత ప్రశాంతంగా ఉండాలి... ఏకాగ్రంగా ఒకే విషయం గురించి ఆలోచిస్తూ... బ్రెయిన్‌లో ఆలోచనల్లేకుండా చేసుకోవాలన్నమాట!

బాబ్జీ : అలా ఉంటే...?


రాంజీ : ఈ గేమ్‌లో ఎక్కువ మార్కులొస్తాయి.

బాబ్జీ : ఇదేం గేమ్‌ రా నాయనా? అయినా మెడిటేషన్లో కాంపిటీషనేంటి? ఇదేదో పోటీ అనుకుని జనం వీధుల్లోకి వస్తున్నారా ఏంటి?


రాంజీ : అబ్బే. లేదురా. ఇది ఇండివిడ్యువల్‌గా ఎవరికి వాళ్లు ఇంట్లోనే ఈ మెడిటేషన్‌ గేమ్‌ ఆడుకోవచ్చు.

బాబ్జీ : రక్షించావ్‌!


రాంజీ : మొత్తానికి మన మెడిటేషన్‌కీ యోగాకీ ఇప్పుడు మంచి డిమాండ్‌ వచ్చేసిందని ఇండియన్లు ఎగిరి గంతేస్తున్నారట.

బాబ్జీ : వీళ్ల బొంద. ఇండియన్స్‌ ఇండియన్స్‌ అని బయట కంట్రీలవాళ్ల దగ్గర గొప్పలు చెప్పుకోవడమే గానీ... నిజాయతీగా రోజూ మెడిటేషన్‌ చేసేవాళ్లు... మనలో ఎంతమంది ఉన్నారు చెప్పు? మనదంతా … పాతవాటి గురించి డబ్బా ఎక్కువ. కొత్తవాళ్లు చేసే పని తక్కువ.


రాంజీ : (ఎక్స్‌ప్రెషన్‌ )

రాంజీ : ఆ మాట నిజమేలే. ఏదేమైనా ఇప్పుడు మెడిటేషన్‌ అందరికీ అవసరమే కదరా?

బాబ్జీ : అవసరమే మరి. పొద్దుట లేస్తే అన్ని చోట్లా కరోనా న్యూసు... తెగ కలవరపెట్టేస్తున్నారు. కాస్త మనసు కుదుటపరుచుకోవాలంటే … ప్రతివాడూ మెడిటేషన్‌ చెయ్యడమే బెటర్రా రాంజీ.


రాంజీ : (ఎక్స్‌ప్రెషన్‌ )



Updated Date - 2020-04-09T23:43:50+05:30 IST