పింఛను ఇస్తారా.. నా భర్తను తెస్తారా?

ABN , First Publish Date - 2022-08-11T08:49:33+05:30 IST

పింఛను ఇస్తారా.. నా భర్తను తెస్తారా?

పింఛను ఇస్తారా.. నా భర్తను తెస్తారా?

అధికారులను డిమాండ్‌ చేసిన వితంతువు

మొగల్తూరు/పాలకొల్లు, ఆగస్టు 10: ‘నా భర్త చనిపోయి నాలుగేళ్లవుతోంది. అప్పటి నుంచి వితంతు పింఛను వస్తోంది. ఇప్పుడు పింఛను ఆపేసి నీ భర్త బతికే ఉన్నాడని చెబుతున్నారు. ఫింఛనైనా ఇవ్వండి.. లేకపోతే భర్తను తెచ్చివ్వండి’ అని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్ప గ్రామానికి చెందిన తిరుమాని కుమారి అధికారులను డిమాండ్‌ చేసింది. ఈమెకు ఆగస్టు నెలలో పింఛను ఇవ్వలేదు. నీ భర్త బతికే ఉన్నట్టు ఆధార్‌ ద్వారా చూపుతోందని వలంటీర్‌ చెప్పారు. అధికారులు స్పందించి పింఛను మంజూరు చేయాలని కోరింది.

Updated Date - 2022-08-11T08:49:33+05:30 IST