ఎమ్మెల్యే ఏం చెప్పినా చేస్తారా..?

ABN , First Publish Date - 2022-09-24T05:25:30+05:30 IST

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ఏం చెబితే పోలీసులు అది చేస్తారా.. అని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు.

ఎమ్మెల్యే ఏం చెప్పినా చేస్తారా..?
జిల్లా జైలు వద్ద ఐ-టీడీపీ నాయకుడు కట్టా లోకే ష్‌ను పరామర్శించడానికి వస్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత

పోలీసులపై ప్రైవేటు కేసు వేస్తాం

మాజీ మంత్రి పరిటాల సునీత హెచ్చరిక

జిల్లా జైలులో ఐ-టీడీపీ నాయకుడికి పరామర్శ

బుక్కరాయసముద్రం, సెప్టెంబరు 23:  

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి ఏం చెబితే పోలీసులు అది చేస్తారా.. అని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు.  అనంతపురం జిల్లా జైలులో  ఉన్న  ఐ-టీడీపీ అనంతపురం రూరల్‌ ఉపాధ్యక్షుడు కట్టా లోకే్‌షను పార్టీ నాయకులతో కలిసి ఆమె శుక్రవారం పరామర్శించారు. అనంతరం జైలు వద్ద మిడియాతో మాట్లాడారు. కొందరు పోలీసులు నియోజకవర్గంలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకే ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వద్ద పోలీసులు అత్యుత్సాహంగా పనిచేస్తున్నారని విమర్శించారు. సిండికేట్‌ నగర్‌కు చెందిన కట్టా లోకేష్‌   సోషియల్‌ మీడియాలో  వైసీపీకి వ్యత్తిరేకంగా  పోస్టు పెట్టినందుకు ఎమ్మెల్యే, ఆయన సోదరులు, వైసీపీ నాయకులు క్షక్ష కట్టారని అన్నారు. అతనిపై అక్రమ కేసులు బనాయించాలని రూరల్‌ సీఐ భాస్కర్‌గౌడ్‌పై ఒత్తిడి చేశారని అన్నారు. అందుకే కట్టా లోకే్‌షను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.  పరిటాల శ్రీరామ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతున్న లోకే్‌షను కమలానగర్‌లో గురువారం సాయంత్రం రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారని, కానీ రాత్రి 10:30 గంటలకు సిండికేట్‌నగర్‌లో కర్ణాటక మద్యం  విక్రయిస్తున్నాడని అక్రమ కేసు పెట్టడం బాధాకరమని అన్నారు. లోకే్‌షను పోలీసులు హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై  జిల్లా పోలీసు ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళితే... కనీస సమాచారం ఇవ్వడం లేదని, ఫోన కూడా ఎత్తడం  లేదని అన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని పోలీసుల పనితీరును పరిశీలించి, అక్రమ కేసులు బనాయిస్తున్నవారిపై ఎస్పీ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. కట్టా లోకేష్‌ విషయంలో పోలీసులపై ప్రైవేటు కేసు వేస్తామని  హెచ్చరించారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, పోలీసుల తీరు మారకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. తమ కుటుంబంపై వైసీపీ సోషల్‌ మీడియాలో వైసీపీవారు అనేక పోస్టులు పెట్టారని, వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులును ఆశ్రయించినా పట్టించుకోలేదని అన్నారు. అక్రమ కేసులు కొనసాగితే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నియోజవర్గంలో పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది తలెత్తినా అన్నివిధాలుగా అదుకుంటామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు  జింకా సూర్యనారాయణ,  బోయ శ్రీనివాసులు,  నెట్టం వెంకటేష్‌, ఎల్‌ నరేంద్ర, నారాయణస్వామి, బండి పరుశురామ్‌, రఘు, జయకృష్ణ, పూజరప్ప తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-09-24T05:25:30+05:30 IST