Jul 10 2021 @ 08:10AM

మహేష్ బాబుతో సినిమా చేస్తా : మణిరత్నం

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తానని తెలిపారు. అద్భుతమైన చిత్రాలు తీసి సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు మణిరత్నం. ఆయన దర్శకత్వంలో నటించేందుకు తెలుగు, తమిళ, హిందీ భాషలలోని స్టార్ హీరోలు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. అలాంటి దర్శకుడు స్వయంగా మహేష్ బాబుతో సినిమా తీస్తానని వెల్లడించగానే అందరిలో ఆతృత మొదలైంది. అయితే ఇందుకు మంచి స్క్రిప్ట్ సిద్దం కావాలని అంటున్నారు. ఆయన నిర్మాణంలో రూపొందుతున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ 'నవరస'. ఆగస్ట్ 6న దీనిని విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మణిరత్నం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగానే గతంలో ఓసారి మహేష్‌తో సినిమా కోసం చర్చలు జరిపానని తెలిపారు. అయితే స్టొరీ సరిగ్గా కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ మొదలవలేదు.. సరైన కథ దొరికినప్పుడు తప్పక మహేష్ బాబుతో సినిమా చేస్తా అని వెల్లడించారు. మణిరత్న ప్రస్తుతం 'పొన్నియన్ సెల్వన్' అనే పాన్ ఇండియన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మహేష్ 'సర్కారు వారి పాట' మూవీ చేస్తున్నారు. అలాగే త్రివిక్రం దర్శకత్వంలో ఓ సినిమా మొదలవబోతోంది. దీని తర్వాత రాజమౌళితో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయాల్సి ఉంది.