హామీలు నెరవేర్చకుండా వీఆర్‌ఏలపై లాఠీచార్జ్‌ చేస్తారా?

ABN , First Publish Date - 2022-10-03T05:52:20+05:30 IST

శాంతియుతంగా సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలపై సీఎం కేసీఆర్‌ లాఠీచార్జ్‌ చేయించి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

హామీలు నెరవేర్చకుండా వీఆర్‌ఏలపై లాఠీచార్జ్‌ చేస్తారా?
ఎరగండ్ల పల్లిలో వృద్ధుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ప్రవీణ్‌కుమార్‌

సమస్యలు పరిష్కరించకుండా దొర అహంకారం ప్రదర్శిస్తున్నారు

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ 


మర్రిగూడ, అక్టోబరు 2: శాంతియుతంగా సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలపై సీఎం కేసీఆర్‌ లాఠీచార్జ్‌ చేయించి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. మండలంలోని తమ్మడపల్లి, తిరగండ్లపల్లి, ఎరగండ్లపల్లి, అజిలాపురం, మర్రిగూడ, కొండూరు, వట్టిప ల్లి, భట్లపల్లిలో బహుజన రాజ్యాధికార యాత్ర ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించి ప్రజలతో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భట్లపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడు తూ, సమస్యలు పరిష్కరించాలని 70 రోజులుగా రాష్ట్రంలోని 23వేల మంది వీఆర్‌ఏలు శాంతియుతంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా అవమానపరుస్తూ దొరల అహంకారం ప్రదర్శిస్తోందన్నారు. డిమాం డ్లు నెరవేర్చాలని వరంగల్‌లో సీఎంను కలిసిన వీఆర్‌ఏలను తమాషా చేస్తున్నారా అని బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయమైన హక్కుల కోసం పోరాడుతుంటే అణచివేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బహుజన రాజ్యంలో వీఆర్‌ఏ, వీఆర్‌వోలను కడుపులోపెట్టి కాపాడుకుంటామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో స్వర్ణయుగం తీసుకొస్తామని అన్నారు. వరంగల్‌లో ఆస్పత్రి ప్రారంభించడానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌ నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో రూ.4.50కోట్లతో నిర్మించి మూడేళ్లు గడిచినా 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. కమీషన్లు ఇచ్చే కార్పొరేట్‌ ఆస్పత్రులకు మాత్రమే సీఎం వెళ్తున్నారన్నారు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సతో మృతిచెందిన కుటుంబాలను ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. వైద్యం కోసం పుస్తెలు, ఆస్తులు, భూములు అమ్ముకునే రోజులు బీఎస్పీ పాలనలోనే పోతాయని అన్నా రు. ఇప్పటికైనా బహుజనులు గ్రహించి మోసకారి సీఎం కేసీఆర్‌ను గద్దె దిం చేందుకు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆధిపత్య పార్టీలన్నీ అక్రమంగా సంపాదించి కూడబెట్టుకున్న సొమ్ము మునుగోడులో పంచి గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ దేశాన్నంతా దోచి అంబానీ, అందానీలకు కట్టబెడుతోందని ఆరోపించారు. బీసీల కులగణన చేయకుండా మోసం చేసిన బీజేపీ లో చేరిన రాజగోపాల్‌రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో  సైదులు, కర్నాటి శ్రీనివాస్‌, ఏర్పుల అర్జున్‌, కత్తుల పద్మ, ఎలిజబెత్‌ ఉన్నారు. 


Updated Date - 2022-10-03T05:52:20+05:30 IST