వజ్రోత్సవాల వేళైనా అభివృద్ధి కలేనా ?

ABN , First Publish Date - 2022-08-14T05:18:38+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఆనందంగా, ఘనం గా వజ్రోత్సవాలు నిర్వహించుకునే సమయమిది. అయినా అంటరానివారుగా ముద్రపడినట్లు ఎస్టీ కాలనీ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు.

వజ్రోత్సవాల వేళైనా అభివృద్ధి కలేనా ?
ఎస్టీ కాలనీలోని గుడిసెలు - ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎస్టీ కాలనీ ప్రజలు

సౌకర్యాలు లేకుండా 40 ఏళ్లగా జీవనం 

అధికారులు స్పందించాలి

అంటరానివారమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఎస్టీ కాలనీవాసులు

ప్రొద్దుటూరు రూరల్‌, ఆగస్టు 13: 

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఆనందంగా, ఘనం గా వజ్రోత్సవాలు నిర్వహించుకునే సమయమిది. అయినా అంటరానివారుగా ముద్రపడినట్లు ఎస్టీ కాలనీ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదు. సుమారు 45 ఏళ్లగా 70 కుటుంబీకులు ఎరుకుల కులస్తులు జీవిస్తున్నారు. ఎందరో పాలకులు మారినా, జీవన విధానంలో ఎన్నోరకాల మార్పులు చేర్పులు జరిగి నా తమ జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలే దని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధి కొత్తపల్లె పంచాయతీ లింగాపురం గ్రామ ఎస్టీ కాలనీ జీవన దుస్థితిపై వివరాల్లోకెళితే.... 

 జాతీయ రహదారికి ఆనుకుని లింగాపురం ఎస్టీ కాలనీ ఉంది. కాలనీలో కనీసం మౌలిక సదుపాయాలేవీ లేవని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీకి చుట్టూ ఉన్న అన్ని వీధుల్లో పంచాయతీ సిబ్బంది కసువు ఊడ్చడం, మురికి కాల్వలు తీస్తున్నారని, తమ కాలనీలో మా త్రం ఏ రోజూ రోడ్లపై కసువు ఊడ్చలేదని ఆరోపి స్తున్నారు. తాము అంటరానివారమా అంటూ వా రు ప్రశ్నిస్తున్నారు. కాలనీలో ఎక్కువ సంఖ్యలో అత్యంత నిరుపేదలున్నా వారికి కనీసం ఉండేందు కు నివాసం లేక పాత చీరెలతో గుడిసెల్లాగా ఏర్పా టు చేసుకుని అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఎస్టీ కాలనీలో కొందరు పందులను పోషించుకుంటూ జీవనం సాగించగా మరికొందరు పరకలు అల్లూతూ, కొన్ని పల్లెల్లో అడ్డుకుంటూ, తుక్కు వెంట్రుకలు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు.

కాలనీలో అత్యంత ధీనస్థితిలో ఉన్న వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని అర్హత ఉండి కూడా పింఛన్లకు నోచుకోనివారు చాలా మంది ఉన్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కాలనీలో మురికి కాల్వలు కానీ, చెత్తకుండీలు ఏమీ లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత నిరుపేదలమైన కూడా ప్రభుత్వం తమ వద్ద నుంచి వలంటీర్ల ద్వారా పన్నులు వసూలు చేస్తున్నారని, వసతులను మరుస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లానింగ్‌ నిధులు ఎస్సీ, ఎస్టీ కాలనీ ల్లో ఖర్చు చేసి అభివృద్ధి పరుస్తుమన్నామని ప్రకటి స్తున్నారే తప్ప తమ కాలనీలో మాత్రం అలాంటివేమీ జరగడంలేదని వారు ఆరోపించారు.

హర్‌ ఘర్‌ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జాతీ య జెండాను ఎగరే యాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయని, ఇల్లు లేనివారు జెండాను ఎక్కడ ఎగరే యాలని వారు ప్రశ్నిస్తున్నారు. తమ లాంటి వారి బతుకులను బాగు చేసే ప్రభుత్వాలు ఏమీ లేవని వారు విమర్శించారు. కనీసం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మా ఎస్టీ కాలనీ ఉంద ని, మమ్మల్ని మనుషులుగా ఎవరూ గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కొత్తపల్లె  పంచాయతీ కార్యదర్శిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా కొత్తపల్లె పంచాయతీ లో ఎస్టీకాలనీ ఉన్న విషయం తనకు తెలియదన్నారు. వివరాలు తెలుసుకుని ఆ కాలనీలో పర్యటించి ఎస్టీ కాల నీ ప్రజల సమస్యల పరిష్కారిస్తామన్నారు. మేజర్‌ సమస్యలు ఉంటే జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతానన్నారు. 


ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లానింగ్‌ నిధులు ఎక్కడో....

 ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధికోసం రూ.కోట్లాది సబ్‌ప్లానింగ్‌ నిధులు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వాలు, పాలకులు చెబుతున్నాయి. అయితే ఈ నిధులు ఏమవుతున్నాయో ఎవరికీ అర్థం కావడంలేదు.  

రామదాసు, ఎస్టీ కాలనీవాసి


మమ్మల్ని మనుషులుగా గుర్తించండి

 కాలనీకి చేరువలోనే పంచాయతీ ఆఫీసు ఉన్నా ఏ అధికారీ ఇక్కడికి రాలేదు. మమ్మ ల్ని కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు మనుషులుగా గుర్తించి సంక్షేమ ఫలాలను అందించి కాలనీని అభివృద్ధి పరచండి.

బాలమ్మ, ఎస్టీ కాలనీ నివాసి


మేమేంటే చులకనా?

ఇక్కడ జీవించే మేమంటే అందరికీ చులక నలాగుంది. అగ్రవర్ణాల కాలనీలో వసతు లు తగ్గితే వెంటనే మళ్లీ ఏర్పాటు చేస్తున్నా రు. అంధకారంలో జీవిస్తున్నాం. అధికారులకు, ప్రజాప్రతినిధులకు అంత చులకనా.

సుంకన్న, ఎస్టీ కాలనీవాసి


కలెక్టర్‌ స్పందించాలి

వజ్రోత్సవాలు చేసుకోండి అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. మా లాంటివారి జీవితాల్లో స్వాతంత్య్రం వచ్చి వందేళ్లయినా సంబరాలు, సంతోషాలు ఉం డవు. తరాలు మారుతున్నా తలరాతలు మారడంలేదు.             

నాగన్న, ఎస్టీ కాలనీవాసి

Updated Date - 2022-08-14T05:18:38+05:30 IST