ధర్నాలో మాట్లాడుతున్న కోట్ల సుజాతమ్మ
ఆలూరు, నవంబరు 29: వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలంటూ మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇనచార్జి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆలూరు టీడీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీగా వచ్చి బైఠాయించారు. అధిక వర్షాలకు పప్పుశనగ, పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ప్రభుత్వం 75 కేజీల విత్తనాలు ఇస్తామని చెప్పడం భావ్యం కాదని కోట్ల సుజాతమ్మ విమర్శించారు.