విచారణ సాగేనా?

ABN , First Publish Date - 2022-04-23T04:20:44+05:30 IST

ఆసిఫాబాద్‌ జిల్లా గిరిజన సంక్షేమశాఖలో చోటు చేసుకున్న నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంపై విచారణ సాగేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గడిచిన ఆరేళ్లుగా జిల్లాలో మరమ్మతులు, ఎలకా్ట్రనిక్‌ పరిక రాల కొనుగోలు పేరిట పెద్ద మొత్తంలో నిధులు ప్రయివేటు వ్యక్తుల ఖాతాలకు మళ్లీంచిన ఘటన వెలుగు చూడడంతో ‘ఆంధ్రజ్యోతి’ ఈ వ్యవహారంపై మార్చి 25 సంచికలో పరిశోధానాత్మక కథనాన్ని ప్రచురించింది.

విచారణ సాగేనా?
లోగో

- గిరిజన సంక్షేమశాఖలో నిధుల గోల్‌మాల్‌పై ‘ఆంధ్రజ్యోతి’ పరిశోధనాత్మక కథనం

- నిజాలు నిగ్గు తెల్చేందుకు ఐటీడీఏ పీవోకు ఆదేశం

- విచారణకు త్రిమెన్‌ కమిటీ 

- నెల రోజులైనా అడుగు ముందుకు పడని వైనం

- అధికారుల చిత్తశుద్ధిపై అనుమానాలు 

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఆసిఫాబాద్‌ జిల్లా గిరిజన సంక్షేమశాఖలో చోటు చేసుకున్న నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంపై విచారణ సాగేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గడిచిన ఆరేళ్లుగా జిల్లాలో మరమ్మతులు, ఎలకా్ట్రనిక్‌ పరిక రాల కొనుగోలు పేరిట పెద్ద మొత్తంలో నిధులు ప్రయివేటు వ్యక్తుల ఖాతాలకు మళ్లీంచిన ఘటన వెలుగు చూడడంతో ‘ఆంధ్రజ్యోతి’ ఈ వ్యవహారంపై మార్చి 25 సంచికలో పరిశోధానాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో శాఖలో జరిగిన అవినీతి నిధుల అవక తవకలపై జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ప్రాథమికంగా విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని ఉ ట్నూరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిని  ఆదేశిం చారు. దీంతో ఉట్నూరు ఐటీడీఏ పీవో జిల్లాకు చెందిన సంబంధిత బాధ్యులను పిలిపించి మౌఖికంగా విచారించారు. అయితే ఈ వ్యవ హారంలో పరస్పరం పొంతన లేని సమాధానాలు రావడంతో ఆయన మొత్తంగా దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయిం చారు. ఈ క్రమంలో మార్చి 29న ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించి పది హేను రోజుల్లోగా ని జాలు నిగ్గు తెల్చేందుకు పూర్తి స్థాయి విచారణ చేయాలని ఆదేశించారు. అయితే నాటి నుంచి నేటి వరకు త్రిమెన్‌ కమిటీ దాట వేత ధోరణి అనుసరించడం తప్ప ఇప్పటి వరకు విచారణకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిందే లేదని ఆ శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించాయి.

- సమాచార హక్కు చట్టంతో..

గిరిజన సంక్షేమశాఖలో కంప్యూటర్‌ పరికరాల కొనుగోలు, మరమ్మ తుల పేరుతో 2016 నుంచి 2022 మార్చి నాటికి జరిగిన లావా దేవీలపై ఆదివాసీ గిరిజన సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంక ర్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరడంతో నిధుల అవకతవకల విషయం వెలుగు చూసింది. ఈ మేరకు సుమారు 36లక్షల రూపాయలను శాఖకు చెందిన సిబ్బంది ప్రయి వేటు ఖాతాలకు మళ్లించినట్లు తేలింది.  అయితే ఈ వ్యవహారంపై అధికా రులు చెప్పుతున్న విషయాలు పరస్పరం పొంతన లేకుండా ఉండటంతో ఈ గోల్‌మాల్‌ వ్యవహారంలో ఇంతకు మించి పెద్ద మొత్తంలో నిధులు అవకతవకలు జరిగి ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేయడం ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ఐటీడీఏ పీవో వద్ద ప్రస్తావించారు. దీంతో ఆయన దీనిపై విచారణకు ఆదేశించారు. 

- విచారణ అధికారులుగా..

ఇందుకు గాను ఐటీడీఏ అధికారులు షేక్‌ ఖరీం, పీవీ రమణ, రాంబాబు అనే ఉద్యోగులను విచారణ అధికారులుగా నియమించారు. పీఓ ఆదేశానుసారం వీరు మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 14 మధ్య విచారణ పూర్తి చేసి నివేదికలను పీవోకు అందజేయాల్సి ఉంది. అయితే ఇప్పటి విచారణ కోసం అధికారులు రాక పోగా దీర్ఘకాలిక సెలవులపై వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ  నేపథ్యంలో ఈ తతంగం వెనక ఏదో మతలబు ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే సదరు ఆదివాసీ నేత మరో సారి ఐటీడీఏ అధికారిని కలిసి విచారణ కమిటీ ఎందుకు విచారణ జరుపడం లేతో తెలుపాలంటూ మరోసారి సమాచారం కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే రెండ్రోజుల్లో విచారణకు కొత్త కమిటీని నియమించే అవకాశం ఉందన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

- కమిటీ పేరుతో కాలయాపన..

జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో అవినీతిని బట్టబయలు చేసేందుకు అధికారులు మొక్కుబడిగా కమిటీని నియమించి కాలయాపన చేస్తు న్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో అధికారుల చిత్తుశుద్ధిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ వ్యవ హారంలో రాజకీయ ప్రముఖ హస్తం ఉందన్న ఆరోపణలు విన్పిస్తు న్నాయి. 2016 నుంచి ఇప్పటి వరకు ఈ శాఖలో పని చేసిన అధికా రులందరికీ ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో కావాలనే విచారణను తొక్కి పెడుతున్నారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 

Updated Date - 2022-04-23T04:20:44+05:30 IST