‘ఫేస్‏బుక్’లో ఆ ఉద్యోగుల వేతనాలు తగ్గనున్నాయా ?

ABN , First Publish Date - 2021-04-22T01:51:51+05:30 IST

సోషల్ మీడియా దిగ్గజం ‘‌ఫేస్‌‌బుక్’లో ఉద్యోగుల వేతనాలు తగ్గనున్నాయా ?

‘ఫేస్‏బుక్’లో ఆ ఉద్యోగుల వేతనాలు తగ్గనున్నాయా ?

క్యాలిఫోర్నియా : సోషల్ మీడియా దిగ్గజం ‘‌ఫేస్‌‌బుక్’లో ఉద్యోగుల వేతనాలు తగ్గనున్నాయా ? కొత్తగా సంస్థలో చేరి... వర్క్ ఫ్రం హోం, రిమోట్‏గా పనిచేయడానికి అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలో... ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ప్రదేశాన్ని వదిలి తమ సొంత దేశాలకు, ఇళ్ళకు వెళ్ళే వారి జీతాలను తగ్గించాలని యోచిస్తున్నట్లుగా వినవస్తోంది.


ఓ నివేదిక ప్రకారం... ఫేస్‌బుక్  పీపుల్ గ్రోత్ వైస్ ప్రెసిడెంట్ బ్రైన్ హారింగ్టన్ మాట్లాడుతూ... ‘మేం మార్కెట్‌లో స్థానిక కార్మికవ్యయం ఆధారంగా చెల్లింపులు జరుపుతాం. ఈ క్రమంలో... రిమోట్ కార్మికులకు వారు పనిచేసే ప్రదేశం ప్రాతిపదికన వేతనాల విషయంలో వైవిధ్యముంటుంది’ అని పేర్కొన్నారు. 


కాలిఫోర్నియాలోని మెన్లోపార్క్ క్యాంపస్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తిరిగి భారతదేశానికి వచ్చి రిమోట్‌గా పనిచేయాలని నిర్ణయించుకుంటే, ఉద్యోగి జీతంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. అతనికి స్థానిక ఉద్యోగుల జీతం ఆదారంగానే చెల్లింపులుంటాయి. అదే సమయంలో రిమోట్ గా పనిచేయడానికి ఫేస్‌బుక్ సపోర్టింగ్ ఉద్యోగులకు ఖర్చులు తగ్గించుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని హారింగ్టన్ చెప్పారు. కొంత మంది ఉద్యోగులు పనిచేస్తూనే ఎదుగుతున్నారని ఆ నివేదికలో వెల్లడించారు.


అలాగే చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తంమీద ఉద్యోగులకు సంబంధించి ఫేస్‌బుక్‌ త్వరలో కీలక నిర్ణయాలను తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నట్లు వినవస్తోంది. 

Updated Date - 2021-04-22T01:51:51+05:30 IST