దుల్హన్‌ పథకం అమలు చేయరా ?

ABN , First Publish Date - 2021-10-20T05:58:24+05:30 IST

పేద ముస్లిం మహిళల వివాహాల కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెచ్చిన దుల్హన్‌ పథకాన్ని అమలు చేయా లని ముస్లిం మైనారిటీ అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్‌ మహబూబ్‌బాషా డిమాండ్‌ చేశారు.

దుల్హన్‌ పథకం అమలు చేయరా ?
మాట్లాడుతున్న ముస్లిం మైనారిటీ సంక్షేమ సంఘ ప్రతినిధులు


గిద్దలూరు, అక్టోబరు 19 : పేద ముస్లిం మహిళల వివాహాల కోసం  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెచ్చిన దుల్హన్‌ పథకాన్ని అమలు చేయా లని ముస్లిం మైనారిటీ అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్‌ మహబూబ్‌బాషా డిమాండ్‌ చేశారు. స్థానిక మసీదులో సమావేశమైన ముస్లింలను ఉద్దేశించి మహబూబ్‌బాషా మాట్లాడుతూ గత ప్రభుత్వం దుల్హన్‌ పథకం కింద పేద ముస్లిం మహిళల వివాహానికి రూ.50వేలు ఇస్తుండగా వైసీపీ అధికారంలోకి వస్తే రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చి పథకాన్ని పక్కన పెట్టిం దన్నారు. ఆదాయం లేని మసీదులలో పని చేస్తున్న ఇమామ్‌, మౌజన్‌ల వేతనాలను టీడీపీ ప్రభుత్వం మంజూరు చేయగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి గతంలో లాగానే వేతనాలు చెల్లించాలని కోరారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడాలని మహబూబ్‌బాషా డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-10-20T05:58:24+05:30 IST