భయం అంటే ఏమిటో నేను నేర్పిస్తా: పవన్‌

ABN , First Publish Date - 2021-09-29T21:58:31+05:30 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అదే జోరుతో ప్రభుత్వం, వైసీపీ నేతలపై మండిపడుతున్నారు. బుధవారం ఆయన జనసేన కార్యకర్తలతో

భయం అంటే ఏమిటో నేను నేర్పిస్తా: పవన్‌

అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అదే జోరుతో ప్రభుత్వం, వైసీపీ నేతలపై మండిపడుతున్నారు. బుధవారం ఆయన జనసేన కార్యకర్తలతో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడారు. ‘‘మా జనసైనికుల సింహ గర్జనలు. వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజం. గ్రామ సింహాలు అంటే కుక్కలు, వీధి కుక్కలు, పిచ్చికుక్కలు, ఊరకుక్కలు. వైసీపీ వ్యక్తులకు డబ్బు, అధికారం, అహకారం, మదం బాగా పుష్కలంగా ఉన్నాయి. వారికి లేనిదల్లా భయం. భయం అంటే ఏమిటో నేను నేర్పిస్తా’’ అని పవన్‌ హెచ్చరించారు.


తాను పారిపోయే వ్యక్తిని కాదని, తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ఏం అడిగినా ఏపీ గురించే అడుగుతానని చెప్పారు. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని పవన్‌ హెచ్చరించారు. తాను ఆడబిడ్డలను చాలా గౌరవిస్తానని చెప్పారు. తన వ్యక్తిగత జీవితం బ్లాక్‌ అండ్‌ వైట్‌ అని పేర్కొన్నారు. గుంటూరు బాపట్లలో పుట్టిన వాడిని తనకు బూతులు రావా..? అని ప్రశ్నించారు. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనదని, రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి బూతులు మాట్లాడటం లేదని పవన్‌కల్యాణ్ అన్నారు.

Updated Date - 2021-09-29T21:58:31+05:30 IST