న్యూట్రిషన్ మాసంలో హృదయాన్ని పదిలంగా చూసుకోండి!

ABN , First Publish Date - 2022-09-07T02:25:41+05:30 IST

ప్రతి ఏడాది సెప్టెంబరు నెలను పౌష్టికాహార మాసం (Nutrition Month)గా పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ తమ

న్యూట్రిషన్ మాసంలో హృదయాన్ని పదిలంగా చూసుకోండి!

ప్రతి ఏడాది సెప్టెంబరు నెలను పౌష్టికాహార మాసం (Nutrition Month)గా పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ తమ జీవనశైలిని గుర్తు చేసుకునే నెల ఇది. తమతోపాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం అత్యంత కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరాన్ని సెప్టెంబరు నెల గుర్తు చేస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం జన్యుపరమైన కారణాలతో భారతీయులు గుండె జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. భారత్‌లో కార్డియోవాస్క్యులర్‌  వ్యాధులు అత్యంత తీవ్రమైన సమస్యలుగా మారుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. డైటరీ, జీవనశైలిలో మార్పులు తీసుకురావడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 


సమతుల ఆహారం తీసుకోవడం అనేది వీటిలో అతి ముఖ్యమైనది. ఇది గుండె వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ పౌష్టికాహారంలో అత్యధిక పోషకాలు కలిగిన ఆహరం, తీసుకునే ఆహారంలో  నియంత్రణ వంటివి కూడా భాగంగా ఉంటాయి. సమతుల, పోషక విలువలు కలిగిన డైట్‌తో గుండె వ్యాధుల ప్రమాదం తగ్గడంతో పాటుగా కొలెస్ట్రాల్‌ స్థాయి కూడా గణనీయంగా తగ్గుతుంది. బాదాములు, తృణధాన్యాలు, బెర్రీల ద్వారా గుండెను పదిలపరుచుకోవచ్చని అంటారు ఢిల్లీ మ్యాక్స్ హెల్త్‌కేర్ రీజనల్ హెడ్ (డైటెటిక్స్) రితికా సమద్దార్. అవేంటో చూద్దాం..


బాదములు

రోజువారీ డైట్‌లో గుప్పెడు బాదాములను చేర్చుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చంటారు రితికా సమద్దార్. వీటిలో విస్తృత శ్రేణిలో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ మాత్రమే కాదు.. గుండె ఆరోగ్యానికీ తోడ్పడతాయి. బాదములలో 14 అత్యవసర పోషకాలు ఉంటాయి. అవి విటమిన్‌-ఇ, మెగ్నీషియం, ప్రొటీన్‌, రిబోఫ్లావిన్‌, జింక్‌ మొదలైనవి. క్రమం తప్పకుండా బాదములు తినడం వల్ల ఎల్‌డీఎల్‌, టోటల్‌ కొలెస్ట్రాల్‌  తగ్గడంతో పాటుగా గుండె ఆరోగ్యాన్ని సైతం ఢోకా ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. రోజూ బాదములు తినడం ద్వారా  గుండె జబ్బులకు అతి ముఖ్య కారణమైన డిస్లిపిడెమియా తగ్గుతుంది. బాదములను తమకిష్టమైన రుచులలో మిళితం చేయడం ద్వారా రుచికరమైన, ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను కుటుంబమంతా ఆస్వాదించవచ్చు.


తృణధాన్యాలు

తృణధాన్యాలలో ప్రొటీన్స్‌, మినరల్స్‌, కాల్షియం, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, విటమిన్స్‌ ఉంటాయి. తృణధాన్యాలకు గుండె జబ్బులను అడ్డుకునే శక్తి ఉందని అధ్యయనాల్లో తేలింది. వీటిద్వారా టోటల్‌ కొలెస్ట్రాల్‌ 8శాతం తగ్గుతుంది.  గోధుమలు, బియ్యాన్ని అధికంగా తీసుకుంటున్నప్పటికీ తృణ ధాన్యాలైనటువంటి పెరల్‌ మిల్లెట్‌ (సజ్జలు), ఫాక్స్‌టైల్‌ మిల్లెట్‌ (కొర్ర), సోర్గమ్‌ (జొన్నలు), ఫింగర్‌ మిల్లెట్‌ (రాగులు) మొదలైనవి భారతదేశంలో నేడు లభిస్తున్న ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాలుగా ఉన్నాయి. వీటిని డైట్‌లో జోడించుకోవడానికి ఇడ్లీలు చేసుకోవచ్చు. బియ్యానికి బదులుగా రాగులు జోడించుకోవడం ద్వారా పౌష్టికాహార భోజనం  చేసుకోవచ్చు.


బెర్రీలు

బెర్రీలలో చక్కటి పౌష్టికాహార ప్రొఫైల్‌ ఉంది. వీటిలో ఫైబర్‌, విటమిన్‌-సి, యాంటీ ఆక్సిడెంట్‌ పాలీఫినాల్స్‌ అధికంగా ఉంటాయి. ఫలితంగా బెర్రీలను డైట్‌లో  జోడించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడొచ్చు. స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, రాస్ప్‌బెర్రీ, మల్‌బెర్రీ మొదలైనవి తీసుకోవడం ద్వారా పాలిపెనాల్స్‌, మరీ ముఖ్యంగా ఆంథోసియానిన్స్‌, మైక్రో న్యూట్రియంట్స్‌, ఫైబర్‌ జోడించవచ్చు. బెర్రీలతో కార్డియోవాస్క్యులర్‌ రిస్క్‌ ప్రొఫైల్స్‌ కూడా  మెరుగుపడతాయి. బెర్రీలతో గణనీయంగా ఎల్‌డీఎల్‌ ఆక్సిడేషన్‌, లిపిడ్‌ పెరాక్సిడేషన్‌, టోటల్‌ ప్లాస్మా యాంటీ ఆక్సిడెంట్‌ సామర్థ్యం,డిస్లిపిడెమియా, గ్లూకోజ్‌ మెటబాలిజం కూడా మెరుగుపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-09-07T02:25:41+05:30 IST