సన్‌రైజర్స్‌ బ్యాటర్స్‌కు రషీద్ ఖాన్ బౌలింగ్

ABN , First Publish Date - 2022-04-11T22:56:43+05:30 IST

ముంబై : ఐపీఎల్ 2022లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న గుజరాత్ టైటాన్స్..

సన్‌రైజర్స్‌ బ్యాటర్స్‌కు రషీద్ ఖాన్ బౌలింగ్

ముంబై : ఐపీఎల్ 2022లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న గుజరాత్ టైటాన్స్.. అంచనాలు అందుకోలేకపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య కీలక సమరం జరగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవనుంది. హార్దిక్ పాండ్యా సారధ్యంలోని గుజరాత్ టైటాన్స్ మంచి దూకుడుగా కనిపిస్తోంది. ఆడిన మూడు మ్యాచుల్లో రెండు గెలుపులతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది.

ఇక కేన్ విలియమ్సన్ సారధ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తన చివరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. దీంతో నేడు జరగబోయే పోరు ఆసక్తికరంగా మారింది. కాగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ‌ఈ సీజన్‌లో తొలిసారి తలపడబోతుండడంతో ఉత్కంఠను రేపుతోంది. ఎందుకంటే గత సీజన్ వరకు సన్‌రైజర్స్‌కు వెన్నెముక బౌలర్‌గా కొనసాగిన రషీద్ ఖాన్.. తొలిసారి సన్‌రైజర్స్ బ్యాటర్లకు బంతులు సంధించనున్నాడు. రషీద్ బౌలింగ్ ముందు హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఎదురు నిలుస్తారా.. వికెట్లు సమర్పించుకుంటారా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.


బలంగా కనిపిస్తున్న ఇరు జట్లు

గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇరు జట్లూ బలంగానే కనిపిస్తున్నాయి. అయితే గుజరాత్ టైటాన్స్ అంచనాలకు మించి రాణిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 180 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్‌కు ఆశాకిరణంగా మారాడు. ఈ మ్యాచ్‌లో కూడా రాణిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కష్టాలు తప్పకపోవచ్చుననే అంచనాలున్నాయి. మరోవైపు హార్ధిక్ పాండ్యా కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక గత సీజన్ వరకు సన్‌రైజర్స్‌కు ఎన్నో విజయాలు అందించిన బౌలర్ రషీద్ ఖాన్ తొలిసారి హైదరాబాద్‌పై మ్యాచ్ ఆడబోతున్నాడు. 


  ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కీలక ఆటగాళ్లతోపాటు వాషింగ్టన్ సుందర్ రాణిస్తే ప్రత్యర్థికి సవాలు విసరడం ఖాయమనే విశ్లేషణలున్నాయి. ఇప్పటికే ఈ సీజన్‌లో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతోపాటు 58 పరుగులు చేసి జట్టుకు చక్కటి సహకారం అందించాడు. కెప్ కాబట్టి ఈ రోజు మ్యాచ్‌లో సుందర్ ప్రదర్శన జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ విలియమ్సన్ మరోసారి రాణిస్తే గుజరాత్ టైటాన్స్ విజయాలకు బ్రేకులు వేసే అవకాశాలున్నాయి.

Updated Date - 2022-04-11T22:56:43+05:30 IST