Shilpa Chowdaryకి జైలా.. బెయిలా..!?

ABN , First Publish Date - 2021-12-21T16:07:48+05:30 IST

ఆర్థిక మోసం కేసులో అరెస్టయి.. జైల్లో ఉన్న శిల్పాచౌదరి దంపతులకు...

Shilpa Chowdaryకి జైలా.. బెయిలా..!?

హైదరాబాద్‌ సిటీ : ఆర్థిక మోసం కేసులో అరెస్టయి.. జైల్లో ఉన్న శిల్పాచౌదరి దంపతులకు బెయిలు వస్తుందా..? లేక జైల్లోనే ఉండాల్సి వస్తుందా..? అనేది నేడు తెలిసే అవకాశం ఉంది. శిల్పా చౌదరికి పోలీస్‌ కస్టడీ ముగిసిన తర్వాత ఉప్పర్‌పల్లి న్యాయస్థానం ఆమెను రిమాండ్‌కు విధించిన విషయం తెలిసిందే. గత వారం బెయిల్‌ పిటిషన్‌ కోర్టులో విచారణకు రాగా.. ఒక్క కేసులో బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం మరో రెండు కేసుల్లో బెయిల్‌ నిరాకరించింది. అనంతరం విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. దాంతో శిల్పాచౌదరి, ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్‌ దంపతులకు బెయిల్‌ పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో మంగళవారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు కేసుల్లో బెయిల్‌ లభిస్తుందా..? లేక న్యాయస్థానం తిరస్కరిస్తుందా..? అనేది ఉత్కంఠగా మారింది.


ఇవి కూడా చదవండిImage Caption

Updated Date - 2021-12-21T16:07:48+05:30 IST