Abn logo
May 19 2020 @ 13:27PM

సందీప్ ఆ సినిమా చేస్తాడా?

`అర్జున్‌రెడ్డి` సినిమాతో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అదే సినిమాను హిందీలోకి `కబీర్‌సింగ్`గా రీమేక్ చేసి సందీప్ మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం సందీప్ ఓ స్టార్ హీరో కోసం కథ సిద్ధం చేస్తున్నాడట. కాగా, మాలయాళంలో విజయవంతమైన `అయ్యప్పనుమ్ కోషియమ్` సినిమా తెలుగు రీమేక్‌ దర్శకుడిగా సందీప్ పేరు వినిపిస్తోంది.


`అయ్యప్పనుమ్ కోషియమ్` తెలుగు హక్కులను సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ దక్కించుకుంది. తెలుగులో నందమూరి బాలకృష్ణ, రానా హీరోలుగా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తోంది. లాక్‌డౌన్ తర్వాత సినిమా చూసి బాలయ్య నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇంటెన్స్ డ్రామా అయిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి దర్శకుడైతే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే సందీప్ రీమేక్ సినిమా చేయడానికి అంగీకరిస్తాడా? అనేది అనుమానాస్పదంగా మారింది. సందీప్ లేదా  హరీష్‌శంకర్‌లలో ఎవరో ఒకరు ఈ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. లాక్‌డౌన్ తర్వాతే ఈ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశముంది. 


Advertisement
Advertisement
Advertisement