‘భీమ్లా నాయక్’కు రన్ టైమ్ పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందా..!

‘భీమ్లా నాయక్’కు రన్ టైమ్ పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందా..! ప్రస్తుతం ఇదే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. 2022, జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ భారీ అంచనాలను ఏర్పరచాయి. త్వరలో చిత్ర మోషన్స్‌ను కూడా మొదలుపెట్టబోతున్నారట. 

అయితే, ‘భీమ్లా నాయక్’ చిత్రానికి రన్ టైమ్ లాక్ చేసినట్టు తాజాగా టాక్ వినిపిస్తోంది. ఇందులో స్పెషల్ సాంగ్స్, ఇంట్రడక్షన్ సాంగ్స్ అలాగే సినిమాకు అనవసరమైన సన్నివేశాలు ఏవీ లేకుండా 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేసినట్లు లేటెస్ట్ న్యూస్. సంక్రాంతి బరిలో రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రన్ టైమ్ మూడు గంటలకు పైగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, ప్రభాస్ - పూజా హెగ్డే నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ రన్ టైమ్ కూడా ఎక్కువే అని సమాచారం. వీటితో పోల్చుకుంటే ‘భీమ్లా నాయక్’ తక్కువని అంటున్నారు. అంతేకాదు ఈ రన్ టైమ్ మూవీకి బాగా ప్లస్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో.  

Advertisement
Advertisement