రాజీనామా చేసి పోటీ చేస్తా: పవన్‌కు రాంబాబు సవాల్‌

ABN , First Publish Date - 2021-01-25T08:40:32+05:30 IST

‘‘ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ పోటీ చేస్తా. నాపై పోటీకి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సిద్ధమా’’ అని ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్‌ విసిరారు.

రాజీనామా చేసి పోటీ చేస్తా: పవన్‌కు రాంబాబు సవాల్‌

ఒంగోలు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ పోటీ చేస్తా. నాపై పోటీకి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సిద్ధమా’’ అని ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్‌ విసిరారు. ఈ మేరకు విలేకరులకు ఆదివారం ఆయన వీడియో సందేశం పంపారు.  గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారపేట మండలం సింగరపల్లిలో జనసేన కార్యకర్త రంగయ్యనాయుడు ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ విషయమై వపన్‌కల్యాణ్‌ తనపై చేసిన ఆరోపణలు, బెదిరింపు హెచ్చరికలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. సీఎం జగన్‌ ఆమోదంతో తాను పదవికి రాజీనామా చేస్తానని, తనపై పోటీకి పవన్‌కల్యాణ్‌ సిద్ధమై గెలిస్తే తాను న్యాయవ్యవస్థ ముందు లొంగిపోతానని చెప్పారు. అదే పవన్‌కల్యాణ్‌ ఓడిపోతే పార్టీని మూసేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-01-25T08:40:32+05:30 IST