రామనవమి ర్యాలీలు పాక్‌లో చేయాలా?: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2022-04-19T21:37:33+05:30 IST

శ్రీరామనవమి రోజుల దేశ రాజధాని ఢిల్లోలోని జహంగీర్‌పూర్‌, కర్ణాటకలోకి హుబ్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లతో పాటు పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. కాగా, ఇందులో ఢిల్లీలో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం..

రామనవమి ర్యాలీలు పాక్‌లో చేయాలా?: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: రామనవమి ఉరేగింపులు, ర్యాలీలు ఇండియాలో కాకుండా ఎక్కడ నిర్వహించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. రామనవమి రోజు దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఘర్షణలపై ఆయన బిహార్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇక్కడ కాకుండా పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్‌లో చేయాలా అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక మతానికి చెందిన కార్యక్రమాల్లో ఇన్ని ఘర్షణలు జరుగుతుంటే ‘‘గంగ జమున తెహ్జీబ్’’ అనే నినాదంలో అర్థమేంటని గిరిరాజ్ ప్రశ్నించారు.


శ్రీరామనవమి రోజుల దేశ రాజధాని ఢిల్లోలోని జహంగీర్‌పూర్‌, కర్ణాటకలోకి హుబ్లీ, మధ్యప్రదేశ్‌, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లతో పాటు పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. కాగా, ఇందులో ఢిల్లీలో జరిగిన అల్లర్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అంశంపై మంగళవారం మంత్రి గిరిరాజ్ స్పందిస్తూ ‘‘రామనవమి కార్యక్రమాలు ఈ దేశంలో జరపకుండా పాకిస్తాన్‌లో చేయాలా, ఆఫ్ఘానిస్తాన్‌లో చేయాలా లేదంటే బంగ్లాదేశ్‌లో చేయాలా? ఇది అన్యాయం కాదా?’’ అని అన్నారు.


మతం ఆధారంగా 1947లో దేశం రెండు ముక్కలైందని, మళ్లీ ఇప్పుడు అలాంటి మత రేఖలు గీసేందుకు ఓవైసీలాంటి వారు ప్రయత్నిస్తున్నారని గిరిరాజ్ అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలను కూల్చేశారని, కానీ ఇక్కడ మసీదులు నిర్మించుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు. అయితే కొన్ని చర్యలు తమ సహనం నశిస్తోందని, తమ సహనాన్ని పరీక్షించవద్దని మంత్రి గిరిరాజ్ హెచ్చరించారు.

Updated Date - 2022-04-19T21:37:33+05:30 IST