పీఎఫ్... పరిధి రూ. 21 వేలకు పెరగనుందా ?

ABN , First Publish Date - 2021-01-27T00:58:24+05:30 IST

ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) పరిధికి సంబంధించి ఉద్యోగులకు త్వరలో మరింత వెసులుబాటు కలగనుందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. పీఎఫ్ శాలరీ డిడక్షన్ లిమిట్ ను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు వినస్తోంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

పీఎఫ్... పరిధి రూ. 21 వేలకు పెరగనుందా ?

న్యూఢిల్లీ : ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) పరిధికి సంబంధించి ఉద్యోగులకు త్వరలో మరింత వెసులుబాటు కలగనుందా ? ఈ ప్రశ్నకు ‘అవును’ అన్న సమాధానమే వినవస్తోంది. పీఎఫ్ శాలరీ డిడక్షన్ లిమిట్ ను పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు వినస్తోంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


పీఎఫ్‌ డిడక్షన్‌కు సంబంధించిన నెలవారీ కనీస స్థూల వేతన పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వినస్తోంది. ఈ లిమిట్‌ను రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు పెంచే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఈ క్రమంలో...  రూ. 21 వేలకు లోపు మూలవేతనం పొందే వారికి కూడా పీఎఫ్ స్కీమ్ వర్తించే అవకాశాలుంటాయి. 


కాగా ఇందుకు సంబంధించి కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవలే ఓ సమావేశాన్ని నిర్వహించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తంమీద పీఎఫ్ పరిమితి పెంచే దిశగా అడుగులు పడుతున్నట్లుగానే భావిస్తున్నారు. 


కాగా 2014 నుంచి పీఎఫ్ డిడక్షన్ లిమిట్ పన్రస్తుత రీతిలోనే కొనసాగుతూ వస్తోంది. మూలవేతనం(బేసిక్ పే) రూ.15 వేల లోపు ఉంటే...  పీఎఫ్ మినహాయింపు ఉంటుంది. గతంలో ఇది రూ. 6,500 గా ఉండేది. ఇప్పుడు ఈ లిమిట్‌ను రూ. 21 వేలకు పెంచాలన్న డిమాండ్ తారస్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే... పీఎఫ్ పరిధిని పెంచే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-01-27T00:58:24+05:30 IST