ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరినీ చనిపోనివ్వం: సీఎం

ABN , First Publish Date - 2021-05-07T01:18:45+05:30 IST

ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరినీ చనిపోనివ్వం: సీఎం

ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరినీ చనిపోనివ్వం: సీఎం

న్యూఢిల్లీ: రాజధానిలో రోజూ 700 టన్నుల ఆక్సిజన్ లభిస్తే తమ ప్రభుత్వం 9,000-9,500 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం చెప్పారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత కారణంగా మేము ఎవరినీ చనిపోనివ్వమని, తాను మీకు భరోసా ఇస్తున్నానని సీఎం అన్నారు.  ఢిల్లీకి బుధవారం 730 టన్నుల ఆక్సిజన్ లభించడంతో ఆసుపత్రుల బెడ్ల సామర్థ్యాన్ని పునరుద్ధరించాలని ఆయన అభ్యర్థించారు.


మరోవైపు కరోనా వైరస్ ఢిల్లీలో విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో రోజువారీగా భారీ సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గురువారం కొత్తగా 19,133 కరోనా వైరస్ కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల 335 మృతి చెందినట్లు ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 12,73,035 కోవిడ్ కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల 18,398 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అంతే కాకుండా నేషనల్ క్యాపిటల్ యొక్క పాజిటివిటీ రేటు సోమవారం 30 శాతం నుంచి 24.29శాతానికి పడిపోయిందని, మంగళవారం, బుధవారం వరుసగా 27శాతం నుంచి 26 శాతానికి పడిపోయిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Updated Date - 2021-05-07T01:18:45+05:30 IST