Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 27 Mar 2022 20:52:26 IST

నేను కాన్షీరాం శిష్యురాలిని: రాష్ట్రపతి పదవిపై మాయావతి

twitter-iconwatsapp-iconfb-icon

లఖ్‌నవూ: తొందరలోనే రాష్ట్రపతి కాబోతున్నారన్న గుసగుసలపై బహుజన్ సమాజ్‌ పార్టీ అధినేత మాయావతి స్పందించారు. ఇదంతా తప్పుడు ప్రచారమని, రాష్ట్రపతితో పాటు ఏ పదవి ఏ పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా ఆమోదించే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఆదివారం ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలోని బీఎస్పీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశం అయ్యారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘మా పార్టీ అంతమవుతుందని తెలిసినప్పుడు నేను అలాంటి పదవికి నేనెలా అంగీకరిస్తాను? బీజేపీనే కాదు ఏ పార్టీ నుంచి రాష్ట్రపతి పదవికి ఆహ్వానం వచ్చినా తీసుకునే ప్రసక్తే లేదు. భవిష్యత్‌లో ఇలా తప్పుదారి పట్టించే ప్రచారం మళ్లీ జరగొచ్చు. అలాంటి వాటి ట్రాప్‌లో పడొద్దని పార్టీ కార్యకర్తలకు నేను స్పష్టం చేస్తున్నాను’’ అని మాయావతి అన్నారు.


ఇంకా ఆమె మాట్లాడుతూ ‘‘ఈ ఎన్నికల్లో బీజేపీ కుట్ర పన్ని గెలిచింది. నన్ను రాష్ట్రపతి చేస్తున్నారని నా ప్రజల్ని నమ్మించి బీజేపీ ఓట్లు దండుకుంది. మా ‘బెహెన్‌జీ’ (సోదరి) రాష్ట్రపతి అవుతున్నారని ప్రజలు బీజేపీని గెలిపించారు. అయినా నేను ఒక్కదాన్నే రాష్ట్రపతి అయి ఏం చేయాలి? మా లక్ష్యాలకు ఇలాంటి పదవులు సూటవ్వవు. గతంలో కాన్షీరాం తిరస్కరించారు. నేను ఆయన శిష్యురాలిని’’ అని అన్నారు.


అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాంకు బీజేపీ రాష్ట్రపతి ఆఫర్ చేసింది. అయితే తాను ఉండాల్సింది బంగళాల్లో కాదని ప్రజల్లో ఉంటానని చెప్పి తిరస్కరించారు. ఈ విషయాన్ని కాన్షీరామే స్వయంగా లోక్‌సభలో పేర్కొన్నారు. మళ్లీ తాజాగా మాయావతి రాష్ట్రపతి కాబోతున్నారని, బీజేపీ ఆమెను రాష్ట్రపతిగా పోటీకి దించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.