2024 అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ పోటీపై వైట్‌హౌస్ క్లారిటీ

ABN , First Publish Date - 2021-12-18T19:08:39+05:30 IST

అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలు.. ఎప్పుడూ ఇది హాట్ టాపికే. అధ్యక్ష పీఠానికి గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉత్కంఠభరితంగా సాగిన విషయం తెలిసిందే. ఆ ఎన్ని

2024 అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ పోటీపై వైట్‌హౌస్ క్లారిటీ

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికలు.. ఎప్పుడూ ఇది హాట్ టాపికే. అధ్యక్ష పీఠానికి గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉత్కంఠభరితంగా సాగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ విజయం సాధించి.. అధ్యక్ష పదవిని చేపట్టిన అతిపెద్ద వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. బైడెన్ అధ్యక్ష పదవిని అలా చేపట్టాడో లేదో అప్పుడే 2024 అధ్యక్ష ఎన్నికలపై ఊహాగానాలు మొదలయ్యాయి. అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హారిస్.. 2024ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడతారని చాలా మంది అభిప్రయాపడ్డారు. బైడెన్‌కు సంబంధించిన కొన్ని వార్తలు కూడా ఆ ప్రచారానికి మరింత బలన్నిచ్చాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ గురించి బైడెన్, కమలా హారిస్‌లు చర్చించుకున్నారనే వార్తలు తాజాగా గుప్పుమన్నాయి. ఈ క్రమంలో 2024 అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ పోటీపై వైట్‌హౌస్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. 



2024 ఎన్నికల్లో పోటీ అంశంపై అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ చర్చించుకున్నారనే అంశం అమెరికాలో చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి వచ్చే అధ్యక్ష ఎన్నికలపై తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. జో బైడెన్, కమలా హారిస్ సమావేశంపై మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే.. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ పోటీకి దిగితే.. కమలా హారిస్ ఉపాధ్యక్ష బరిలో ఉంటారా? అనే ప్రశ్నకు మాత్రం బదులిచ్చారు. 2024 అధ్యక్ష బరిలో బైడెన్ ఉంటే.. కమలా హారిస్ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారని.. ఇందులో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. 


ఇదే అంశంపై కమలా హారిస్ కూడా స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. బైడెన్‌తో జరిగిన సమావేశాల గురించి మాట్లాడబోనని చెప్పారు. అంతేకాకుండా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల్లో గురించి ఆలోచించడం లేదని చెప్పారు. 




Updated Date - 2021-12-18T19:08:39+05:30 IST