ఇది కూలిపోదా?

ABN , First Publish Date - 2022-04-10T05:39:55+05:30 IST

ఇది వర్కూరులో నీళ్ల ట్యాకు. శిథిలమైపోయి పిల్లర్లలోని ఇనుప కడ్డీలు బైటికి కనిపిస్తున్నాయి. పిల్లర్‌ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఎప్పుడైనా ఇది కూలిపోవచ్చని ప్రజలు ఆందోళన పడుతున్నారు.

ఇది కూలిపోదా?
శిథిలావస్థలో ఉన్న వర్కూరులో నీళ్ల ట్యాంకు

శిథిలమైపోయిన వర్కూరు నీళ్ల ట్యాంకు

 తుప్పుపట్టి బైటికి కనిపిస్తున్న కడ్డీలు 


కోడుమూరు (రూరల్‌), ఏప్రిల్‌ 9: ఇది వర్కూరులో నీళ్ల ట్యాకు. శిథిలమైపోయి పిల్లర్లలోని ఇనుప కడ్డీలు బైటికి కనిపిస్తున్నాయి.  పిల్లర్‌ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఎప్పుడైనా ఇది కూలిపోవచ్చని ప్రజలు ఆందోళన పడుతున్నారు. 1986లో దీన్ని ప్రారంభించినట్లు ఇక్కడి శిలాఫలకం చెబుతోంది.  సుమారు 36 ఏళ్లు గడిచిపోయాయి.  ఈ ట్యాంకు నుంచి కొన్నేళ్ల పాటు గ్రామానికంతా తాగునీరు సరఫరా చేశారు.   పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రస్తుతం ముస్లిం, బీసీ, కోటవీధులకు దీన్నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు.  అయితే ట్యాంకు  పిల్లర్లకు, మిగతా భాగాలకు  పలుచోట్ల చీలికలు వచ్చాయి.   సిమెంట్‌ దిమ్మెల నుంచి పలుచోట్ల ఇనుప కడ్డీలు బయటకు కనిపిస్తున్నాయి. అవి కూడా తుప్పు పట్టి పోయాయి.  ఈ  ట్యాంకు ఇండ్ల మధ్య ఉండటంతో ఎప్పుడు కూలిపోతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-04-10T05:39:55+05:30 IST