Shilpa Chowdary దంపతులు బెయిల్‌పై బయటికొస్తారా..!?

ABN , First Publish Date - 2021-12-16T17:30:12+05:30 IST

Shilpa Chowdary దంపతులు బెయిల్‌పై బయటికొస్తారా..!?

Shilpa Chowdary దంపతులు బెయిల్‌పై బయటికొస్తారా..!?

  • శిల్పకు 14 రోజులు రిమాండ్‌


హైదరాబాద్‌ : శిల్పాచౌదరి కస్టడీ ముగియడంతో నార్సింగ్‌ పోలీసులు ఆమెను బుధవారం ఉదయం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. శిల్పాచౌదరి ఆర్థిక మోసం కేసులో పోలీసుల వాదనలు, వారు అందించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను, సాక్ష్యాలను క్రోడీకరించి శిల్పాచౌదరి ఆర్థిక మోసం కేసుపై పోలీసులు త్వరలోనే చార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. పోలీసులు మరోసారి కస్టడీ పిటిషన్‌ దాఖలు చేసే అవకాశాలు లేకపోవడంతో.. శిల్పాచౌదరి దంపతులు బెయిల్‌పై బయటకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.



Updated Date - 2021-12-16T17:30:12+05:30 IST