Farooq Abdullah : ఎన్నికల్లో పోటీకి సిద్ధమే
ABN , First Publish Date - 2021-09-08T22:37:53+05:30 IST
జమ్మూ కశ్మీర్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, తాము సిద్ధంగానే ఉన్నామని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, తాము సిద్ధంగానే ఉన్నామని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. అయితే పరిపూర్ణమైన రాష్ట్ర హోదా కోసం తమ పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. ఓ వైపు ఎన్నికల్లో పోటీ చేస్తూనే, పరిపూర్ణమైన రాష్ట్ర హోదా కోసం పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన ప్రకటించారు. అయితే ఎన్నికల తేదీలను ఎప్పుడు ప్రకటిస్తారన్నది తమకు తెలియదని, కానీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న స్పష్టమైన సంకల్పంతోనే ఉన్నామని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు.