ట్రీట్‌మెంట్‌ కోసం బెంగళూరుకు.. ఇంతకీ ఏమైంది ఆ క్రికెటర్‌కు..?

ABN , First Publish Date - 2022-06-04T01:51:12+05:30 IST

ఐపీఎల్‌లో గాయం కారణంగా టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే టోర్నీ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించాడు

ట్రీట్‌మెంట్‌ కోసం బెంగళూరుకు.. ఇంతకీ ఏమైంది ఆ క్రికెటర్‌కు..?

బెంగళూరు: ఐపీఎల్‌లో గాయం కారణంగా టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే టోర్నీ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించాడు. కోల్‌కతా తరఫున ఆడుతున్న సమయంలో కండరాల గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని తెలిపాడు. ట్రీట్‌మెంట్‌ కోసం మరోసారి బెంగళూరులోని ఎన్‌సీఏలో పునరావాసం కోసం వెళ్తున్నట్లు వెల్లడించాడు.


ప్రస్తుతం తన దృష్టంతా వేగంగా కోలుకోవడంపైనే ఉందని చెప్పాడు. వీలైనంత త్వరగా ఫిట్‌నెస్‌ సాధించి మైదానంలోకి తిరిగి అడుగుపెట్టాలని అనుకుంటున్నానని తెలిపాడు. ఇక కోల్‌కతాతో తన అనుబంధం చాలా బాగుందని చెప్పాడు. కేకేఆర్‌ తరఫున ఆడడం నిజంగా ఎంతో సంతోషానిచ్చిందని పేర్కొన్నాడు.


ఐపీఎల్‌లో దురదృష్టవశాత్తు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రహానే 133 పరుగులు చేశాడు. మరోవైపు రహానే సారథ్యంలో ఆస్ట్రేలియాపై సాధించిన గత టెస్టు సిరీస్‌ విజయంపై రూపొందించిన డాక్యుమెంటరీలో తన మెల్‌బోర్న్‌ టెస్టు సెంచరీని అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

Updated Date - 2022-06-04T01:51:12+05:30 IST