వన్యప్రాణులకు రక్షణ

ABN , First Publish Date - 2021-01-22T04:48:34+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిఽధిలో వన్యప్రాణుల రక్షణపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించారు. వేటగాళ్ల పై నిఘా పెట్టడంతో పాటు రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు.

వన్యప్రాణులకు రక్షణ

ఉమ్మడి జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణపై అటవీ శాఖ అధికారుల దృష్టి

మంజీరాతో పాటు ఇతర ప్రాంతాల్లో నిఘా 

జంతువుల వేట, కలప అక్రమ రవాణాపై నజర్‌

పలుచోట్ల గస్తీ చేపడుతున్న అధికారులు

నిజామాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిఽధిలో వన్యప్రాణుల రక్షణపై అటవీ శాఖ అధికారులు దృష్టి సారించారు. వేటగాళ్ల పై నిఘా పెట్టడంతో పాటు రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. వన్యప్రాణులను కాపాడడంతో పాటు కలప అక్రమ రవాణా కాకుండా చర్యలు చేపడుతున్నారు. మంజీర పరీవాహక ప్రాంతంలో కృష్ణజింకలతో పాటు ఇతర వన్యప్రాణులు ఎక్కువగా ఉండడంతో అటవీ శాఖ అధికారులు పో లీసులతో సమన్వయం చేసుకుంటూ వాటి రక్షణకు చర్యలు చేపడుతున్నారు. 

చిరుతల సంచారంపై అప్రమత్తం

ఉమ్మడి జిల్లా పరిధిలో చిరుత పులుల సంచారం పెరగడంతో అటవీ శాఖ అధికారులు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిఽధిలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉండడం.. పంట పొలాల వైపు కృష్ణ జింకలతో పాటు అడవి పందులు ఇతర జంతువులు ఎక్కువగా వస్తుండడంతో అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అడవుల సమీప గ్రామా లలో వన్యప్రాణులు ఎక్కువగా సంచరిస్తుండడంతో వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. గత నెలలో కోటగిరి, వ ర్ని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట జరగడంతో అధి కారులు అప్రమత్తమయ్యారు. తమ శాఖతో పాటు పోలీసు శాఖ వారితో సమన్వయం చేసుకుంటూ గస్తీ కొనసాగిస్తున్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గత వారం వర్ని సమీపంలో కృష్ణ జింకల మాంసం పట్టుబడడంతో మరింత అప్రమత్తమయ్యారు. 

కలప అక్రమ రవాణా వేటగాళ్లపై నిఘా

రాష్ట్ర అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రా వడంతో అటవీ రేంజ్‌లు, సెక్షన్‌ల పరిధిలో నిఘా పెంచా రు. కలపను అడ్డగోలుగా నరకడంతో పాటు జంతువులను వేటాడే వారిపైన దృష్టి సారించారు. అటవీ జంతువులు నీ రు తాగేందుకు వచ్చే వాగులు, చెరువుల వద్ద వేట జరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తమయ్యారు. ఆయా గ్రామా ల పరిధిలోని వారి సహకారం కూడా తీసుకుంటూ ముం దుకుపోతున్నారు. మంజీర వెంట ఉమ్మడి జిల్లా పరిధిలో జింకలు ఎక్కువగా కనిపిస్తుండడంతో ఆ ప్రాంతంపైనా ని ఘా పెంచారు. ఎస్సారెస్పీతో పాటు నిజాంసాగర్‌, అలీసాగర్‌లో నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల అడవి పందులు, జింక లు ఎక్కువగా బయటకు వస్తున్నాయి. వీటితో పాటు చిరు త పులులు కూడా తిరుగుతున్నాయి. పొలాల వద్దకు అడవి పందులు రాకుండా పెట్టిన క రెంటు వైర్లు తాకి వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నా యి. ఈ పరిస్థితిలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రై తులతో మాట్లాడుతున్నారు. కరెంట్‌ తీగలు పెట్టడం వల్ల ఇ బ్బందులు ఎదురవుతున్నాయని వారికి వివరిస్తున్నారు. 

తగ్గిన కలప అక్రమ రవాణా

అటవీ శాఖ అధికారుల నిఘా పెరగడం వల్ల కలప అక్ర మ రవాణా కూడా కొంతమేర తగ్గింది. రాత్రివేళ్లో రోడ్ల వెం ట తనిఖీలు చేస్తుండగా అటవీ ప్రాంతంలో గస్తీ తిరుగుతుండడంతో కొం త మేరకు తగ్గినట్లు అ ధికారులు అచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా ప రిధిలోని లింగంపేట, ఎడపల్లి, మాక్లూ ర్‌ మండలాల పరిధిలో చిరుత సంచారం కనపించడంతో ఆ ప్రాంత గ్రామాల ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. వేట జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 50 వరకు చిరుత పులులు ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు అచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వన్యప్రాణుల రక్షణకు చర్యలు చేపట్టామని జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌ ఈరమత్‌ తెలిపారు. ఉ మ్మడి జిల్లా పరిధిలో నిఘా పెంచామన్నారు. పంట చేన్ల వద్ద కరెంటు తీగలు పెట్టడంతో వన్యప్రాణులు మృతిచెందుతున్నాయని ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రా ంతాల్లో చిరుతల సంచారం వాస్తవమేనని ఆయన అన్నారు.

అడవుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు

నిజామాబాద్‌  జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌ ఇరామత్‌  

 పిట్లం జనవరి 21 : ఉమ్మడి జిల్లాలో అడవుల పు నరుద్ధరణకు ప్రత్యేక చర్యలు చెపడు తున్నామని నిజామాబాద్‌  జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌ ఇరామత్‌ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లా పిట్లం అ టవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ఏడాది 1,750 హెక్టార్‌లలో చెట్లు ఏపుగా పెరగ డానికి చర్యలు తీసుకున్నామన్నారు. అటవీశాఖ స్థలా ల్లో మొక్కల పెంపకం, జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. అటవీ ప్రాంతం లో సరిహద్దుల ఏర్పాటు పూర్తి కాగానే వచ్చే ఏడాది ను ంచి నాటిన మొక్కలు ఎండిపోకుండా నీటి వసతి కోసం మినీ ట్యాంకులను ఏర్పాటు చేసి మొక్కల సంరక్షణకు చర్యలు చేపడతామన్నారు. వర్షాకాలం నీరు వృథాగా పో కుండా అటవీప్రాంతంలో నీరు ఇంకేవిధంగా కందకాలు తవ్వించడం, జంతువులకు తాగునీటి కోసం సాసర్‌ పి ట్‌లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. అట వీ శాఖ ఖాలీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటించడం జరుగుతుందన్నారు. అటవీ ప్రాంతంలో ఎవరు కూడా చెట్లను నరకకూడదని, స్థలాలను కబ్జా చేయకూడదన్నా రు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంద న్నారు. ఆయన వెంట ఎఫ్‌డీవో సాగర్‌, ఎఫ్‌ఆర్‌వో సంజ య్‌గౌడ్‌, సిబ్బంది సిద్దార్థ ఉన్నారు.

Updated Date - 2021-01-22T04:48:34+05:30 IST