గడ్డిక్షేత్రాల పెంపకంతో పెరిగిన వన్యప్రాణులు

ABN , First Publish Date - 2022-05-27T04:32:30+05:30 IST

కవ్వాల టైగర్‌ జోన్‌లో వన్య ప్రాణుల సంరక్షణకు చేపడుతున్న గడ్డి క్షేత్రాల పెంపకం సత్ఫలితాలనిచ్చింది. దేశంలోనే మొదటి సారిగా కవ్వాల టైగర్‌ జోన్‌లో గడ్డి క్షేత్రాలను ప్రయోగాత్మకంగా అటవీ శాఖ అధికారులు చేపట్టారు. ఈ గడ్డి క్షేత్రాలు వన్యప్రాణుల ఆకలి తీర్చేందుకు సత్ఫలితాలు ఇవ్వడంతో వన్య ప్రాణుల సంఖ్య రెండింతలు పెరిగింది. దీంతో అటవీ శాఖ అధికారులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు అటవీ ప్రాంతాల్లో గడ్డి క్షేత్రాలు పెంచేందుకు చర్యలు చేపట్టారు.

గడ్డిక్షేత్రాల పెంపకంతో పెరిగిన వన్యప్రాణులు
కుంటల వద్ద గడ్డి పెంపకంపై అవగాహన కల్పిస్తున్న ఎఫ్‌డీవో మాధవరావు

జన్నారం, మే 26: కవ్వాల టైగర్‌ జోన్‌లో వన్య ప్రాణుల సంరక్షణకు చేపడుతున్న గడ్డి క్షేత్రాల పెంపకం సత్ఫలితాలనిచ్చింది. దేశంలోనే  మొదటి సారిగా కవ్వాల టైగర్‌ జోన్‌లో గడ్డి క్షేత్రాలను ప్రయోగాత్మకంగా అటవీ శాఖ అధికారులు చేపట్టారు. ఈ గడ్డి క్షేత్రాలు వన్యప్రాణుల ఆకలి తీర్చేందుకు సత్ఫలితాలు ఇవ్వడంతో వన్య ప్రాణుల సంఖ్య రెండింతలు పెరిగింది. దీంతో అటవీ శాఖ అధికారులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు అటవీ ప్రాంతాల్లో గడ్డి క్షేత్రాలు పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే గురువారం కవ్వాల టైగర్‌ జోన్‌ పరిధిలోని జన్నారం రేంజ్‌లో గల గోండగూడ, ఇందన్‌పల్లి రేంజ్‌లోని బర్తన్‌పేట అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికా రులకు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అటవీ కళాశాల ప్రొఫెసర్‌ మురా త్కర్‌ హాజరై అధికారులకు అవగాహన కల్పించారు. చెరువుల వద్ద గడ్డి విత్తనాల సేకరణతోపాటు సరైన భూమి ఎలా ఎంచుకోవాలో వివరించారు. గడ్డి క్షేత్రాల వల్ల సత్ఫలితాలు, వన్యప్రాణులకు జరిగే మేలు, గడ్డిని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో టైగర్‌ జోన్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఆదిలాబాద్‌ సీసీఎఫ్‌ రామలింగం, వరంగల్‌ సీసీఎఫ్‌ సైదులు, జిల్లా అటవీ శాఖ అధి కారి శివానీ డోంగ్రె, జన్నారం ఎఫ్‌డీవో మాధవరావు, ఆమ్రబాద్‌ టైగర్‌ రిజర్వు డీఎఫ్‌వో కిష్టగౌడ్‌తో పాటు ములుగు, వరంగల్‌, భూపాలపల్లి, కవ్వాల టైగర్‌ జోన్‌లోని అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-27T04:32:30+05:30 IST