కాలిఫోర్నియా అడవుల్లో ఎగిసిప‌డుతున్న మంట‌లు...

ABN , First Publish Date - 2020-06-09T17:25:27+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సోలానో కౌంటీలోని అడ‌విలో అగ్ని కీల‌లు ఎగిసిప‌డుతున్నాయి.

కాలిఫోర్నియా అడవుల్లో ఎగిసిప‌డుతున్న మంట‌లు...

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సోలానో కౌంటీలోని అడ‌విలో అగ్ని కీల‌లు ఎగిసిప‌డుతున్నాయి. 1,800 ఎకరాలకు ఈ మంట‌లు విస్త‌రించాయి. జూన్ 6న ప్రారంభ‌మైన ఈ క్వాయిల్ ఫైర్ కేవ‌లం ఒకే రోజులో 1,800 ఎక‌రాల‌ను కాల్చి బూడిద చేసింది. దీంతో అగ్నిమాపక రక్షణకు బాధ్యత వహిస్తున్న కాలిఫోర్నియా ఏజెన్సీ 600 మంది సిబ్బందిని, 30 ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపింది. ఇప్పటివరకు అగ్నిమాప‌క సిబ్బంది 40 శాతం మంటలను అదుపులోకి తెచ్చాయి. కాగా, భారీ మొత్తంలో అడవిలోని జంతుజాలం ఈ మంట‌ల్లో చిక్కుకుని ప్రాణాలొదిలి ఉంటాయని అట‌వీశాఖ అధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.    

Updated Date - 2020-06-09T17:25:27+05:30 IST