Abn logo
Mar 1 2021 @ 15:05PM

రాష్ట్రంలో ఆటవిక పాలన: కళా వెంకటరావు

 శ్రీకాకుళం: రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబును రేణిగుంట ఎయిర్ పోర్టులో అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో టీడీపీపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన ఆరోపించారు. జిల్లాలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఎస్ఈసీ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. 

Advertisement
Advertisement
Advertisement