నేటితో వీకీపీడియాకు 20 ఏళ్లు.... 300 భాషల్లో సమాచారం అందిస్తూ...

ABN , First Publish Date - 2021-01-15T17:01:08+05:30 IST

గూగుల్‌లో మనం ఏదైనా సెర్చ్ చేసినపుడు సాధారణంగా మనకు ముందుగా వీకీపీడియా పేజీ కనిపిస్తుంది.

నేటితో వీకీపీడియాకు 20 ఏళ్లు.... 300 భాషల్లో సమాచారం అందిస్తూ...

న్యూఢిల్లీ: గూగుల్‌లో మనం ఏదైనా సెర్చ్ చేసినపుడు సాధారణంగా మనకు ముందుగా వీకీపీడియా పేజీ కనిపిస్తుంది. ఈ రోజు వీకీపీడియా జన్మదినం. 2001, జనవరి 15న వీకీపీడియాను జిమ్మీ వేల్స్, లారీ సాంగెర్ సంయుక్తంగా ప్రారంభించారు. సమాచారాన్ని ఎవరైనా ఎడిట్ చేయగలిగే సౌలభ్యం వీకీపీడియాలో ఉంది. సాంకేతిక ప్రపంచంలోని సమాచారాన్నంతటినీ ఏకీకృతంచేసే ఈ వేదికను క్రౌడ్ సోర్సింగ్ అని అంటారు.  



వీకీపీడియాను ప్రారంభించేముందు జిమ్మీ వేల్స్, లారీ సాంగెర్ దీనికి న్యూపీడియా పేరుతో ఈ ఎన్‌సైక్లోపీడియాను ఆవిష్కరించారు. దీనిలో తొలుత నిపుణులు ఆర్టికల్స్ రాసేవారు. తరువాత రివ్యూ చేసి పబ్లిష్ చేసేవారు. తరువాతి కాలంలో వీకీపీడియాను ఆవిష్కరించారు. తొలుత ప్రతీ యూజర్ వీకీపీడియాలో ఎడిట్ చేసే అవకాశం ఉండేది కాదు. కొద్ది నెలల తరువాత యూజర్లందరికీ వీకీపీడియాలో ఎడిట్ చేసే అవకాశం కల్పించారు. మొదట్లో వీకీపీడియాను ఇంగ్లీషు భాషలో మాత్రమే ప్రారంభించారు. ప్రస్తుతం 300కు పైచిలుకు భాషల్లో వీకీపీడియా అందుబాటులో ఉంది. 2003లో వీకీపీడియాను హిందీ బాషలో ఆవిష్కరించారు. ప్రస్తుతం వీకీపీడియాలో 5.5 కోట్లకు పైగా ఆర్టికల్స్ అందుబాటులో ఉన్నాయి.

Updated Date - 2021-01-15T17:01:08+05:30 IST