wikileaks:జైల్లోనే జులియన్ అసాంజే పెళ్లికి అనుమతి

ABN , First Publish Date - 2021-11-13T16:56:15+05:30 IST

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే జైలులో ఉన్న తన భాగస్వామి స్టెల్లా మోరిస్‌ను వివాహం చేసుకోవడానికి అనుమతి లభించినట్లు...

wikileaks:జైల్లోనే జులియన్ అసాంజే పెళ్లికి అనుమతి

లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే జైలులో ఉన్న తన భాగస్వామి స్టెల్లా మోరిస్‌ను వివాహం చేసుకోవడానికి అనుమతి లభించినట్లు బ్రిటీష్ అధికారులు తెలిపారు.గూఢచర్యం ఆరోపణలపై అమెరికాకు అప్పగించే ప్రయత్నంలో అసాంజేను 2019 నుంచి లండన్‌లోని బెల్మార్ష్ జైలులో ఉంచారు. లండన్‌లోని ఈక్వెడార్ ఎంబసీలో అసాంజే ఉన్న సమయంలో ఈ జంట మధ్య సంబంధం ఏర్పడింది.దక్షిణాఫ్రికాలో జన్మించిన న్యాయవాది అసాంజే, మోరిస్‌లకు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. జనవరిలో అసాంజేను అప్పగించాలన్న అమెరికా అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు.  


అయితే అమెరికా ప్రభుత్వ అప్పీల్‌ను ఉన్నత న్యాయస్థానం పరిశీలిస్తున్నప్పుడు అసాంజే జైలులోనే ఉన్నాడు.అసాంజే, మోరిస్ లు 2020ఏప్రిల్ లో తమ సంబంధాన్ని బహిరంగ పర్చారు. తమ పెళ్లికి అనుమతి కోసం జైలు అధికారులకు వారు దరఖాస్తు చేసుకున్నారు.అనుమతించినా ఇంకా పెళ్లికి తేదీ ఖరారు కాలేదని జైలు అధికారులు చెప్పారు. దశాబ్దం క్రితం వేలకొద్దీ లీకైన సైనిక, దౌత్య పత్రాలను వికీలీక్స్ ప్రచురించినందుకు యూఎస్ ప్రాసిక్యూటర్లు అసాంజేపై 17 గూఢచర్య ఆరోపణలు,కంప్యూటర్ దుర్వినియోగానికి సంబంధించి అభియోగాలు మోపారు.

Updated Date - 2021-11-13T16:56:15+05:30 IST