భర్త Cinemaకు తీసుకెళ్లలేదని ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-06T16:37:19+05:30 IST

భర్త సినిమాకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది...

భర్త Cinemaకు తీసుకెళ్లలేదని ఆత్మహత్య

హైదరాబాద్ సిటీ/చేవెళ్ల : భర్త సినిమాకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. శంకర్‌పల్లి మునిసిపాలిటీ కేంద్రంలోని భవానీనగర్‌ కాలనీకు చెందిన రాజు ముంబైకి చెందిన స్వాతి(25)ని మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్థానికంగా ఉంటూ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి సెకండ్‌షో సినిమాకు తీసుకెళ్లాలని స్వాతి భర్తను కోరగా.. ఇప్పుడు వద్దన్నాడు. మనస్తాపం చెందిన ఆమె గురువారం ఉదయం భర్త పనికి వెళ్లి తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. పక్కనున్నవారు వచ్చి చూడగా.. తలుపులు వేసి ఉన్నాయి. పిలిచినా తీయలేదు. అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా స్వాతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వారు రాజు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more