Abn logo
Apr 19 2021 @ 07:49AM

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

హైదరాబాద్/దిల్‌సుఖ్‌నగర్‌ : భర్త వేధింపులు తాళలేక గృహిణ ఆత్మహత్యకు పాల్పడింది. కర్మన్‌ఘాట్‌ డివిజన్‌ శ్రీలక్ష్మీగణేష్‌నగర్‌ కాలనీలో నివాసముంటున్న ప్రసాద్‌, అనుశ్రీ దంపతులు కొద్ది రోజులుగా గొడవ పడుతుండేవారు. ప్రసాద్‌ భార్యను వేధింపులకు గురి చేస్తుండేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఆదివారం కూడా భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో అనుశ్రీ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రసాద్‌ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
Advertisement