Advertisement
Advertisement
Abn logo
Advertisement

మగాళ్లు కలలో కూడా ఊహించలేని కండీషన్లను భర్తకు పెట్టిందో భార్య.. వాట్సాప్ లొకేషన్ షేర్ చేయడం నుంచీ చాటింగ్ వరకూ లిస్టే ఇదీ..

ఇంటర్నెట్ డెస్క్: తన భర్త గురించి అసలు నిజం తెలిసిన వెంటనే ఆమెకు తిక్కరేగిపోయింది. పెళ్లైనా కూడా భర్త మరో మహిళ వెంట పడటం చూసి ఆమె భరించలేకపోయింది. ఇక నీతో కాపురం చేయనంటే చేయను అంటూ భర్తకు తెగేసి చెప్పింది! ఆ తరువాత.. పెట్టేబేడా సద్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే..  భార్యకు దూరమై అగచాట్లు పడుతున్న భర్త కూడా తన తప్పు తెలుసుకున్నాడు.


ఈ క్రమంలో పోలీసులు  ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ సెషన్‌కు హాజరయ్యేందుకు సిద్ధమయ్యాడు. ఇక్కడ వరకూ ఓకే కానీ.. కౌన్సెలింగ్‌లో మాత్రం ఆమె తన భర్త ముందు దిమ్మతిరిగే కండీషన్లు ఉంచింది. ఆమె చెప్పిన షరతులకు భర్త మొదట ఆశ్చర్యపోయినా చివరికి తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఆ షరతులన్నిటినీ అంగీకరించాడు. మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లో ఇటీవల జరిగిన ఈ కౌన్సెలింగ్ తాలుకు వివరాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి..

ఇవీ చదవండి:

కళ్లముందు కోట్ల రూపాయలున్నా వాడుకోలేని స్థితి.. ఓ వృద్ధుడి వింత కష్టం!

పెళ్లికి మరదలు నో చెప్పిందని.. నలుగరు ఆడపిల్లలకు తండ్రైన ఓ వ్యక్తి కిరాతకంగా..


భర్తకు ఆమె పెట్టిన కండీషన్లు ఏంటంటే..

భర్త తన గర్ల్‌ఫ్రెండ్‌ను శాశ్వతంగా వదిలిపెట్టాలి. ఆమెతో ఇకపై  చాటింగ్‌ గట్రా లాంటివేమీ ట్రై చేయకూడదు. భర్త జీవితం నుంచీ ఆమె గుర్తులన్నీ పూర్తిగా తొలగిపోవాలి. అంతే కాకుండా..  భర్త తనతో చిన్న చిన్న విషయాలను గొడవపడటం మానుకోవాలి. జీతం అందగానే దాన్ని తెచ్చి తన చేతుల్లో పెట్టాలి. భర్త ఎక్కడున్నా సరే తన లోకేషన్‌ను ఎప్పటికప్పుడు తనతో షేర్ చేయాలి. అంతేకాకుండా.. తాను ఎప్పుడు ఫోన్ చేసినా వెంటనే లిఫ్ట్ చేయాలి. కాల్ కట్ చేయటం లేదా.. బిజీగా ఉన్నానంటూ ఏవేవో  కుంటిసాకులు చెప్పడం కట్టిపెట్టాలి. 

ఆఫీసు అయిపోగానే వెంటనే ఇంటికి ప్రయాణం కట్టాలి. తీరిక సమయాల్లో వీలైనంతగా ఇంట్లో ఉండేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి.. కుంటిసాకులు చెబుతూ బయటకెళ్లేందుకు ట్రై చేయకూడదు. ఇలా ఆమె తన భర్త ముందు ఓ భారీ లిస్టు పెట్టింది. అయితే.. ఎప్పటికప్పుడు లోకేషన్ షేర్ చేయాలని భార్య అనడంతో అతడు తొలుత బిత్తరపోయాడు. చివరికి తన కాపురం చక్కబడితే చాలనుకుంటూ భార్య షరతులన్నింటికీ అంగీకరించాడు. దీంతో.. ఆమె మళ్లీ అత్తారింట్లో కాలు పెట్టేందుకు రెడీ అయింది.  

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement