ఇంట్లో నగలు, డబ్బు మాయం.. భార్య కూడా మిస్సింగ్.. నిజం తెలిసిన ఆ భర్త ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-08-30T19:26:08+05:30 IST

ఇంట్లో నగటు, డబ్బు మాయమైనట్లు తెలిసి అతను ఆశ్చర్యపోయాడు. తీరా చూస్తే భార్య కూడా కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన అతను ఆరా తీయగా..

ఇంట్లో నగలు, డబ్బు మాయం.. భార్య కూడా మిస్సింగ్.. నిజం తెలిసిన ఆ భర్త ఏం చేశాడంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో నగటు, డబ్బు మాయమైనట్లు తెలిసి  అతను ఆశ్చర్యపోయాడు. తీరా చూస్తే భార్య కూడా కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన అతను ఆరా తీయగా.. భార్యే తనను మోసం చేసిందని గ్రహించాడు. పుట్టింటి వారితో కలిసి అమెరికా వీసా సంపాదించిన భార్య.. చెప్పాపెట్టకుండా నగలు, డబ్బు తీసుకొని అమెరికా చెక్కేసింది. ఈ విషయం తెలిసిన సదరు భర్త తన జీవితం సర్వనాశనమైపోయిందంటూ ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ ఘటన హరియాణాలోని కర్నాల్ జిల్లాలో వెలుగు చూసింది. స్థానికంగా నివశించే విజయ్ కుమార్‌కు కొంతకాల క్రితం పెళ్లయింది. ఈ క్రమంలో తాజాగా ఇంట్లో ఉన్న నగదు, నగలు తీసుకొని భార్య పరారైనట్లు అతనికి తెలిసింది.


దీంతో విజయ్ ఆత్మహత్యా యత్నం చేశాడు. అయితే అతన్ని కాపాడిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆత్మహత్యా యత్నం కేసు నమోదు చేసి విజయ్‌ను అరెస్టు చేశారు. ఏమైందని ప్రశ్నించగా.. తన అత్తమామలు, బావమరిది తదితరులు కలిసి తన భార్యకు అమెరికా వీసా ఇప్పించారని విజయ్ వెల్లడించాడు. ఈ విషయం తనకు తెలియదని చెప్పాడు. ఆ వీసాతోనే ఇప్పుడు తన భార్య అమెరికా పారిపోయిందని వివరించాడు. అంతకుముందు రోజు కోసం తీసుకున్న విమానం టికెట్ తాను క్యాన్సిల్ చేయించానని, కానీ మరో టికెట్ కొనుక్కొని భార్య పరారైందని అతను వాపోతున్నాడు. భార్య ఇలా వెళ్లిపోవడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Updated Date - 2021-08-30T19:26:08+05:30 IST