భర్తను అమ్మకానికి పెట్టిన భార్య.. భర్త గురించి ఆమె రాసింది వింటే నవ్వాపుకోలేరు.. ఇంతకీ ఆమె అలా ఎందుకు చేసిందంటే..

ABN , First Publish Date - 2022-02-05T22:35:29+05:30 IST

ఆమెకు తన భర్తపై కోపం వచ్చింది.. అలాగని అతను పెద్ద నేరమేం చెయ్యలేదు.. భార్యను ఇంట్లో వదిలేసి చేపల వేటకు వెళ్లాడంతే..

భర్తను అమ్మకానికి పెట్టిన భార్య.. భర్త గురించి ఆమె రాసింది వింటే నవ్వాపుకోలేరు.. ఇంతకీ ఆమె అలా ఎందుకు చేసిందంటే..

ఆమెకు తన భర్తపై కోపం వచ్చింది.. అలాగని అతను పెద్ద నేరమేం చెయ్యలేదు.. భార్యను ఇంట్లో వదిలేసి చేపల వేటకు వెళ్లాడంతే.. ఆ మాత్రం దానికే ఆమెకు విపరీతంగా కోపం వచ్చింది.. వెంటనే తన భర్తను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టేసింది.. అమ్మకానికి పెట్టేటపుడు తన భర్త గురించి ఆమె రాసింది చదివి ఎంతో మంది నవ్వుకుంటున్నారు.. న్యూజిలాండ్‌లో ఈ ఘటన జరిగింది. 


న్యూజిలాండ్‌లో నివసిస్తున్న ఐరిష్ మహిళ మెక్ అలిస్టర్ తన భర్త జాన్‌ను ఇటీవల `ట్రేడ్ మీ` అనే ఆక్షన్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టింది. కొందామనుకునేవాళ్లకు భర్త గురించి అన్ని వివరాలు చెప్పింది. `జాన్‌ ఎత్తు 6 అడుగుల 1 అంగుళాలు. వయస్సు 37 సంవత్సరాలు. పశువుల రైతు. చేపలు పట్టడంలో ఆరితేరిన వాడు. అయితే ఇంటి పనుల విషయంలో జాన్‌కు కొంత శిక్షణ అవసరం. ప్రస్తుతానికి నాకు అంత ఓపిక లేద`ని మెక్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఆశ్చర్యకరంగా ఆ ప్రకటనకు 100 డాలర్ల వరకు బిడ్‌లు కూడా వచ్చాయి. 


2019లో మెక్, జాన్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలున్నారు. భార్య తనను వెలానికి పెట్టిందని తెలుసుకున్న జాన్ నవ్వుకున్నాడు. ఏదో కోపంలో అలా చేసి ఉంటుందని, తామిద్దరం చాలా అన్యోన్యంగా ఉంటామని చెప్పుకొచ్చాడు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ఉందనే కారణంతో ఆ ప్రకటనను `ట్రేడ్ మీ` వెబ్‌సైట్ తొలిగించింది. తమ వెబ్‌సైట్‌లో జీవిత భాగస్వామిని వేలానికి పెట్టడం ఇదే మొదటి సారి అని `ట్రేడ్ మీ` సిబ్బంది చెబుతున్నారు. 

Updated Date - 2022-02-05T22:35:29+05:30 IST