కడుపునిండా తినేసి ప్లేట్ కడుగు.. అంటూ అక్కడే వదిలేసి వెళ్లిన భర్త.. కోపంతో ఆ భార్య ఊహించని చర్య..!

ABN , First Publish Date - 2021-10-15T22:28:10+05:30 IST

భార్యను చిన్న చూపు చూసిన ఓ భర్తకు.. ఆమె బాగానే బుద్ధి చెప్పింది. అందుకోసం సోషల్ మీడియాను వాడుకుంది. నా భర్త చేసిన వ్యవహారం ఇది.. అంటూ నెట్టింట కడిగిపారేసింది.

కడుపునిండా తినేసి ప్లేట్ కడుగు.. అంటూ అక్కడే వదిలేసి వెళ్లిన భర్త.. కోపంతో ఆ భార్య ఊహించని చర్య..!

ఒకప్పుడు కుటుంబంలో మగవారిదే ఆధిపత్యం ఉండేది. వారు చెప్పింది భార్య వినాలి అనే సంప్రదాయం ఉండేది. అయితే రానురాను సమాజంలో మార్పు వచ్చింది. నేటి ఆధునిక యుగంలో మగవారితో పోటీపడుతూ ఆడవారు ఎదుగుతున్నారు. కొన్ని కుటుంబాల్లో భర్తలు ఇంటి పనులు చూసుకుంటుంటే.. భార్యలు ఉద్యోగాలు చేసే పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి కాలంలోనూ భార్యను చిన్న చూపు చూసిన ఓ భర్తకు.. ఆమె బాగానే బుద్ధి చెప్పింది. అందుకోసం సోషల్ మీడియాను వాడుకుంది. నా భర్త చేసిన వ్యవహారం ఇది.. అంటూ నెట్టింట కడిగిపారేసింది. వివరాల్లోకి వెళితే.. 


ఇండోనేషియాకు చెందిన ఓ జంట కాపురంలో భర్త ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా ఇంట్లో పనులన్నీ మహిళలే చూసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కుటుంబాల్లో ఇద్దరూ ఉద్యోగస్తులైతే.. ఒకరికొకరు సాయం చేసుకుంటూ జీవితం నెట్టుకొస్తుంటారు. అయితే ఇక్కడ ఓ భర్త నిర్లక్ష్యం.. భార్య ఆగ్రహానికి దారి తీసింది. తిన్న తర్వాత ప్లేటును శుభ్రం చేయకుండా అలాగే వదిలేసి వెళ్లాడు భర్త. దీంతో సహనం కోల్పోయిన భార్త.. తిని వదిలేసిన ప్లేట్లను విసిరిపారేసింది. 


తన భర్త ప్రవర్తనను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వాటిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. అంతటితో ఆగకుండా మొత్తం పురుషులందరికీ క్లాసు పీకింది. ‘‘ ఇంట్లో భార్యకు విలువ ఇవ్వండి.. భోజనం చేయగానే ప్లేటు ఎందుకు కడగరని ప్రశ్నించింది. ఎవరి ప్లేటు వారు కడుక్కోవడంలో తప్పు ఏముందీ.. కడగడానికి బరువుగా ఉంటే.. కనీసం సింక్‌లోనైనా వేయొచ్చు కదా..’’.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నెట్టిజన్లు వివిధ రకాలు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2021-10-15T22:28:10+05:30 IST