భర్త చనిపోయాక కూడా.. అతడి ఫ్రెండ్స్‌తో గంటల తరబడి భార్య ఫోన్‌కాల్స్.. పోలీసులు ఆరాతీస్తే నివ్వెరపోయే నిజాలు..!

ABN , First Publish Date - 2022-05-18T18:12:11+05:30 IST

అతను ఒక అంతర్జాతీయ బైక్ రైడర్.. వివాహితుడైన అతను 2018లో జైసల్మేర్‌లోని రోడ్డు ప్రమాదంలో మరణించాడు..

భర్త చనిపోయాక కూడా.. అతడి ఫ్రెండ్స్‌తో గంటల తరబడి భార్య ఫోన్‌కాల్స్.. పోలీసులు ఆరాతీస్తే నివ్వెరపోయే నిజాలు..!

అతను ఒక అంతర్జాతీయ బైక్ రైడర్.. వివాహితుడైన అతను 2018లో జైసల్మేర్‌లోని రోడ్డు ప్రమాదంలో మరణించాడు.. రోడ్డు ప్రమాదంలో మరణం అని నమోదు చేసుకున్న పోలీసులు కేసు మూసేశారు.. అయితే 2020లో అనుకోకుండా ఆ కేసు ఫైల్ ఓపెన్ చూసి పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ చూసిన జిల్లా ఎస్పీకి అనుమానం కలిగింది.. కేసు రీ ఓపెన్ చేసి విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.. ఎంతో మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న భార్య చేతిలోనే అతను హతమయ్యాడని ఎట్టకేలకు పోలీసులు బయటపెట్టారు. 

ఇది కూడా చదవండి..

చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి మాయం.. రెండేళ్ల తర్వాత సడన్‌గా కనిపించిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..



రాజస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ బైక్ రైడర్ అస్బాక్ మోన్ మరణం వెనక ఆయన భార్య పాత్ర ఉందనే సంచలన నిజం తాజాగా బయటపడింది. అస్బాక్ భార్య సుమేరాకు తన భర్త స్నేహితుల్లో చాలా మందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయి. ఈ విషయం అస్బాక్‌కు తెలియడంతో సుమేర అతడిని చంపించింది. పథకం ప్రకారం జైసల్మేర్‌లో 2018 ఏప్రిల్‌లో అస్బాక్‌ను అతని స్నేహితులే చంపారు. సుమేరా చెప్పిన మాటలు నమ్మి పోలీసులు సహజ మరణం అని పేర్కొంటూ కేసును క్లోజ్ చేశారు. అయితే 2020లో కొత్తగా వచ్చిన జిల్లా ఎస్పీ ఆ కేసు ఫైల్ చూడగా అనుమానాలు మొదలయ్యాయి. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో మెడ విరిగినట్టు ఉండడంతో ఆయనకు అనుమానం ప్రారంభమైంది. సుమేరా ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేశారు. అలాగే అస్బాక్ చనిపోయిన వారం రోజులకు ఆయన అకౌంట్ నుంచి రూ.కోటిన్నర ట్రాన్స్‌ఫర్ అయినట్టు తెలుసుకున్నారు. 


భర్త మరణించిన తర్వాత కూడా అతని స్నేహితులు ఇద్దరితో సుమేరా గంటల కొద్దీ మాట్లాడినట్టు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆ ముగ్గురికీ నోటీసులు పంపారు. అయితే ఎవరూ విచారణకు హాజరు కాలేదు. దీంతో అస్బాక్‌ది హత్య కేసుగా నమోదు చేసి సుమేరా, సంజయ్, విశ్వాస్‌లను నిందితులుగా చేర్చారు. విచారణలో సుమేరా వివాహేతర సంబంధాలు బయటపడ్డాయి. అలాగే అస్బాక్ ఆస్తులను కూడా సుమేరా తన పేరు మార్చుకున్నట్టు తేలింది. పోలీసులు తన కోసం గాలిస్తున్నట్టు తెలియడంతో సుమేరా అదృశ్యమైంది. తరచుగా సిమ్‌లు మారుస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరిగింది. ఆమె ఫోన్ ట్రేస్ చేసి మే 13, 2022 సాయంత్రం 5 గంటలకు బెంగళూరులోని ఓ ఫ్లాట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-05-18T18:12:11+05:30 IST