పెళ్లైన 6 రోజులకే భర్తకు గుడ్‌బై చెప్పిన భార్య.. ఆమె చేసిన పనికి అతడి మైండ్ బ్లాంక్.. అత్తామామల మద్దతు కూడా కూతురుకే..

ABN , First Publish Date - 2022-05-22T20:37:40+05:30 IST

పెళ్లైన 6 రోజులకే నవవధువు తన భర్తకు షాకిచ్చింది. అతడికి గుడ్‌బై చెప్పి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అనంతరం ఆమె చేసిన పనికి అతడి మైండ్ బ్లాంక్ అయింది. సరే.. విషయం అత్తామామలకు చెబితే వాళ్లైనా తమ కూతురుకి నచ్చజెబుతారులే అను

పెళ్లైన 6 రోజులకే భర్తకు గుడ్‌బై చెప్పిన భార్య.. ఆమె చేసిన పనికి అతడి మైండ్ బ్లాంక్.. అత్తామామల మద్దతు కూడా కూతురుకే..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లైన 6 రోజులకే నవవధువు తన భర్తకు షాకిచ్చింది. అతడికి గుడ్‌బై చెప్పి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అనంతరం ఆమె చేసిన పనికి అతడి మైండ్ బ్లాంక్ అయింది. సరే.. విషయం అత్తామామలకు చెబితే వాళ్లైనా తమ కూతురుకి నచ్చజెబుతారులే అనుకున్నాడు. కానీ వాళ్లు కూడా కూతురుకే మద్దతు ఇవ్వడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



హర్యానాలోని అంబాల జిల్లాకు చెందిన అభిషేక్‌‌కు తేలి మండి ప్రాంతానికి చెందిన యువతితో వివాహం జరిగింది. పెళ్లైన రెండు, మూడు రోజులకే భార్య గురించి సంచలన విషయం తెలిసింది. పెళ్లికి ముందే ఆమె వేరొక వ్యక్తిని ప్రేమించిందని తెలిసి కంగుతిన్నాడు. పదే పదే అతడితో ఫొన్లో మాట్లాడటం చూసి పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. అయితే ఆమె మాత్రం అతడికి షాకించ్చింది. వివాహం జరిగిన 6 రోజులకే డబ్బు, నగలతో ఇంట్లోంచి పారిపోయింది. అనంతరం తన ప్రియుడు బాబును పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసి అభిషేక్ కంగుతిన్నాడు. అత్తామామలకు ఫోన్ చేసి తమ కూతురు చేసిన పని గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్లు తమ కూతురుకే మద్దతు తెలపడంతో విస్తుపోయాడు. పైగా లేనిపోని కేసుల్లో ఇరికిస్తాం అని వాళ్లు బెదించిడంతో పోలీసులకు ఆశ్రయించాడు. అభిషేక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2022-05-22T20:37:40+05:30 IST