Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోడి కూర వండాల్సిందేనని పట్టుబట్టిన భర్త.. వద్దన్నా వినకపోవడంతో ఆ భార్యకు విసుగొచ్చి..

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతాయి. అలాంటి ఒక ఘటన బీహార రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లాలో జరిగింది. చంపారన్ జిల్లాలోని బేతియా నగరంలో నాగేంద్ర సింగ్ అనే వ్యక్తి తన అల్లుడు తన కూతురిని హత్య చేయాలని ప్రయత్నించాడని, ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


పోలీసులు విచారణ చేయగా.. భార్యభర్తల జరిగిన చిన్నతగువు ప్రాణాంతకంగా మారిందని తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం బేతియా నగరానికి చెందిన రాహుల్ కుమార్(26)కు పక్క గ్రామం పహాడ్‌పూర్‌లో నివసించే నాగేంద్ర సింగ్ కుమార్తె ఆర్తీ దేవి(19)తో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. 


ఆర్తీ దేవికి చిన్నప్పటి నుంచి మాంసాహారం తినడం ఇష్టం లేదు. ఆమె ఎక్కువగా శాఖాహారంమే తినేది. కానీ రాహుల్ కుమార్‌కు చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం. వీరిద్దరికీ వివాహమైన తరువాత ఆర్తీ దేవి మాంసాహారం వండడానికి భర్తతో గొడవపడేది. తాను తినకపోయినా భర్త సంతోషం కోసం అప్పుడప్పుడూ చికెన్ వంటచేసేది. కానీ రాహుల్‌కు మాత్రం రోజూ మాంసాహారం కావాలి. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. 


అలా రాహుల్ కుమార్ నవంబర్ 15న ఇంటికి చికెన్ తెచ్చుకొని భార్యను వంటచేయమన్నాడు. ఆ రోజు ఏకాదశి కావడంతో ఆర్తీ మాంసాహారాన్ని ముట్టుకోనని చెప్పింది. ఈ విషయంలో ఇద్దరూ మళ్లీ గొడవ పడ్డారు. ఒకవైపు రాహుల్ ఎలాగైనా ఈ రోజు చికెన్ తినాల్సిందేనని పంతం పట్టుకొని కూర్చొగా.. మరోవైపు ఆర్తీ ఏకదశి రోజు ఇంట్లో మాంసాహారం వండడానికి వీల్లేదని భీష్మించుకుంది. చివరికి రాహుల్ ఏం చేయాలో తోచక ఇంటి బయట వరండాలో చికెన్ వండడం మెదలు పెట్టాడు. ఈ విషయం ఆర్తీ గమనించలేదు. చికెన్ వంట పూర్తి కాగానే.. రాహుల్ తానే గెలిచానని భార్యతో అన్నాడు. 


రాహుల్ చాలా పెద్ద తప్పు చేశాడని.. ఏకాదశి రోజు అలా చేయడం ఇంటికి అరిష్టమని చెప్పి.. ఆర్తీ తనంతట తాను ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. అది చూసిన రాహుల్ 'ఎంత పని చేశావ్.. ఆర్తీ!' అంటూ ఆమెను కాపాడబోయాడు. కానీ కిరోసిన్ చాలా ఎక్కువగా ఉండడంతో అప్పటికే మంటలు బాగా పెరిగిపోయాయి. ఎలాగోలా ఆర్తీ ఒంటిపై నిప్పుని ఆర్పి ఆమెను రాహుల్ ఆస్పత్రికి  చేర్చాడు. అలా చేయడంలో రాహుల్ చేతులు కూడా కాలిపోయాయి. 


ఆస్పత్రిలో డాక్టర్లు ఆర్తీ శరీరం 90 శాతం కాలిపోయిందని.. కాపాడడం చాలా కష్టమని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స జరుగుతుండగా.. నవంబర్ 16న ఆర్తీ ప్రాణాలు వదిలింది. ఆర్తీ శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. ఆర్తీ మరణం కేసుని పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. రాహుల్‌ని చంపేస్తామని ఆర్తీ కుటుంబ సభ్యులు బెదిరిస్తుండడంతో రాహుల్‌కు పోలీసుల రక్షణలో చికిత్స జరుగుతూ ఉంది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement